జులపాల జట్టుతో, ఒంటి నిండి గాయాలతో ఫుల్ డిఫరెంట్ మూడ్ లో కనిపించాడు రెబల్ స్టార్ ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న స్పిరిట్ మూవీ పోస్టర్ రిలీజైంది. న్యూ ఇయర్ 2026 సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ కు పోస్టర్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ప్రభాస్, త్రిప్తి డిమ్రి లుక్ ఆకట్టుకుంటున్నాయి.
స్పిరిట్ పోస్టర్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ మూవీ అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక స్పిరిట్ టైటిల్ తోనే హైప్ పెంచేశారు. ఆ తర్వాత వాయిస్ స్టోరీ అంటూ వీడియోతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ చేసి మరింత ఇంట్రెస్ట్ తెప్పించగలిగారు మేకర్స్.
కొత్తగా ప్రభాస్
స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్. బుధవారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి రిలీజ్ చేసిన స్పిరిట్ పోస్టర్ లో ప్రభాస్ కొత్తగా కనిపిస్తున్నాడు. షర్ట్ లేకుండా జులపాల జుట్టు, ఒంటిపై గాయాలు, చేతిలో మందు బాటిలో, నోటిలో సిగార్.. ఇలా ఫుల్ మాస్ యాక్షన్ హీరోలా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగా తన స్టైల్లో ప్రభాస్ ను మార్చేశాడనే కామెంట్లు వస్తున్నాయి.
హీరోయిన్ త్రిప్తి డిమ్రి లుక్ ను రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఈ పోస్టర్ లోనే ప్రభాస్ కు సిగార్ వెలిగిస్తూ త్రిప్తి కనిపించింది. అందంతో మరోసారి అలరించేందుకు రెడీ అయినట్లే కనిపించింది త్రిప్తి.
ఆజానుబాహుడు
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ను ఆజానుబాహుడు అంటూ ఎక్స్ లో స్పిరిట్ పోస్టర్ ను పోస్టు చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ‘‘ఇండియన్ సినిమా.. మీ ఆజానుబాహుడు/ఆజానుబాహు ను చూసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026’’ అని క్యాప్షన్ ఇచ్చాడు సందీప్. ఇప్పుడీ పోస్టర్ తెగ వైరల్ గా మారింది. స్పిరిట్ తో సందీప్, ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ను ఆజానుబాహుడు అంటూ ఎక్స్ లో స్పిరిట్ పోస్టర్ ను పోస్టు చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ‘‘ఇండియన్ సినిమా.. మీ ఆజానుబాహుడు/ఆజానుబాహు ను చూసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026’’ అని క్యాప్షన్ ఇచ్చాడు సందీప్. ఇప్పుడీ పోస్టర్ తెగ వైరల్ గా మారింది. స్పిరిట్ తో సందీప్, ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}స్పిరిట్ గురించి
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ మూవీ స్పిరిట్. ఇప్పటికే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు తన దైన స్టైల్లోనే ప్రభాస్ ను రా అండ్ బోల్డ్ గా చూపిస్తూ మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలు త్రిప్తి డిమ్రి, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను 2027లో రిలీజ్ చేసే అవకాశముంది.