Sreeleela: తెలుగులో శ్రీలీలకు ఆఫర్స్ లేవా? ముంబయిలో ఏం చేస్తోంది? ఆ తప్పు తెలిసిందంటూ క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
Sreeleela: ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో శ్రీలీల సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఈ రెండేళ్లలో టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీలీలకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా తన కెరీర్ పై శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
Sreeleela: అదరగొట్టే డ్యాన్స్ తో, ఆకట్టుకునే యాక్టింగ్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకుంటూ శ్రీలీల సాగిపోతుంది. తెలుగు సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మూవీస్ చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

5 నెలల్లో 5 సినిమాలు
ఒకప్పుడు టాలీవుడ్ లో శ్రీలీల జోరు మామూలుగా సాగలేదు. ఆమె నటించిన తెలుగు సినిమాలు 5 నెలల్లో 5 రిలీజ్ కావడం విశేషం. 2023 సెప్టెంబర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించిన ‘స్కంద’ రిలీజైంది. ఆ తర్వాత వరుసగా భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు చేసింది శ్రీలీల. వరుసగా 5 నెలల్లోనే ఈ 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి.
రెండేళ్లలో మూడు చిత్రాలు
టాలీవుడ్ లో శ్రీలీల స్పీడ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆమె హీరోయిన్ గా చేసిన మూవీస్ వరుసగా ఫ్లాప్ కావడమే అందుకు కారణం. అందుకే 2025 నుంచి ఇప్పటివరకూ ఆమె తెలుగులో ‘రాబిన్ హుడ్’, ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు మాత్రమే చేసింది. ఇవీ కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.
తెలుగులో బ్రేక్
తెలుగులో వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో శ్రీలీలకు ఇక్కడ ఆఫర్స్ రావట్లేదనే ప్రచారం జోరందుకుంది. ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. హిందీ, తమిళంలో సినిమాలు చేస్తుంది. అయితే సినిమాల షూటింగ్ లో విరామం, తన కెరీర్ గురించి తాజాగా శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
రెండేళ్లు అలా
తాజాగా ఓం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘మీ అందరికీ తెలుసు. మెడిసన్ తర్వాత ముంబయిలో రెండేళ్లు ఇంటర్న్ షిప్ చేస్తున్నా. ఒకానొక టైమ్ లో సినిమా ఆఫర్స్ వచ్చినా చేయలేకపోయా. ఎందుకంటే నేను ఫిజికల్ గా అక్కడ అటెండ్ కావాల్సి వచ్చింది’’ అని శ్రీలీల చెప్పింది.
ఆ తప్పు తెలుసుకున్నా
‘‘నా ఇండస్ట్రీ జర్నీ మీకు తెలుసు. నేను చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చా. ఏ సినిమాలో ఛాన్స్ వచ్చినా చేసుకుంటూ పోయా. అప్పుడు మూవీస్ ను సెలక్ట్ చేసుకునే పొజిషన్ లో లేను. కాబట్టి ఫ్లోలో వెళ్లిపోయా. అయినా మీరు ప్రేమ చూపించారు. అంతకంటే ఆనందం ఏం లేదు.
ఆ తర్వాత ఆలోచించుకున్నా. నేను చేస్తున్న తప్పు ఏంటీ అని తెలుసుకున్నా. ఆ టైమ్ లో డైెరెక్టర్ రాజ్ కుమార్ పెరియాస్వామిని కలిశా. నీకు కావాల్సింది ఎంచుకున్నప్పుడే, సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడే నీ లైఫ్ మారిపోతుందని ఆయన చెప్పారు’’ అని శ్రీలీల పేర్కొంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


