...
...
Next Story

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూపై బిగ్ అప్‌డేట్.. సినిమా నిజంగానే ఆగిపోయిందా?

Sreeleela: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. బాలీవుడ్ హార్ట్‌థ్రాబ్ కార్తీక్ ఆర్యన్ తో జోడీగా శ్రీలీల చేస్తున్న సినిమా ఆగిపోయిందనే రూమర్లు వచ్చాయి. అయితే ఈ రొమాంటిక్ డ్రామా గురించి ఓ లేటెస్ట్ అప్ డేట్ తెగ వైరల్ గా మారింది. అదేంటో చూసేయండి.

Published on: Aug 15, 2026, 15:56:11 IST
Advertisement

Sreeleela: దక్షిణాదిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రీలీల చాలా కాలం క్రితమే కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్‌లో ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అసలు సెట్స్‌పైకి వెళ్తుందా లేక పక్కన పెట్టేశారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

శ్రీలీల షూటింగ్

కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూపై బిగ్ అప్‌డేట్
కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూపై బిగ్ అప్‌డేట్

అయితే, ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ శ్రీలీల ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయిందని టాక్. అనురాగ్ బసు ప్లాన్ చేసిన ఈ లాంగ్ షెడ్యూల్‌లో కార్తీక్ ఆర్యన్, శ్రీలీలల మధ్య కీలకమైన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది.

‘ఆషికి 3’ కాదు

కార్తీక్, శ్రీలీల జోడీగా నటిస్తున్న ఈ సినిమాను ‘ఆషికి 3’ (Aashiqui 3) గా ప్రచారం చేశారు. అయితే, ఇది ఏ ఫ్రాంచైజీకి సంబంధం లేని ఒక పక్కా ఒరిజినల్ లవ్ స్టోరీ అని మేకర్స్ స్పష్టం చేశారు.

‘బర్ఫీ’, ‘యే జవానీ హై దివానీ’ వంటి క్లాసిక్స్ అందించిన అనురాగ్ బసు, ఈ చిత్రాన్ని ఒక ఇంటెన్స్ ఎమోషనల్ అండ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా మలుస్తున్నారు.

ఈ కాంబినేషన్

అనురాగ్ బసు - మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ (Pritam) కాంబినేషన్‌కు బాలీవుడ్‌లో తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ చిత్రానికి కూడా ప్రీతమ్ అందించే చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అతిపెద్ద పిల్లర్‌గా నిలవనుంది.

చిత్ర బృందం ఈ ప్రాజెక్ట్‌కి ‘తు మేరీ జిందగీ హై’ అనే టైటిల్‌ను లాక్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

శ్రీలీల కెరీర్‌కు ఎందుకంత కీలకం?

కేవలం డాన్సులకే పరిమితం కాకుండా, ఒక నటిగా తనలోని ఎమోషనల్ యాక్టింగ్ స్కిల్స్‌ను ఉత్తరాది ప్రేక్షకులకు నిరూపించుకోవడానికి అనురాగ్ బసు సినిమా పర్ఫెక్ట్ లాంచ్ ప్లాట్‌ఫామ్ గా శ్రీలీల భావిస్తోంది.

ఇప్పటికే క్రేజీ బజ్

కార్తీక్ ఆర్యన్, శ్రీలీల సినిమాపై ఇప్పటికే క్రేజీ బజ్ ఉంది. ఇక వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ స్టార్లు ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

సౌత్‌లో అప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న శ్రీలీల.. కార్తీక్ ఆర్యన్ వంటి మాస్ అండ్ క్లాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ స్టార్‌తో జతకట్టడం వల్ల నార్త్ ఇండియాలోనూ అర్బన్ అండ్ డిజిటల్ ఫ్యాన్ బేస్‌ను వేగంగా క్రియేట్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe