శ్రీలీల నటించిన తమిళ పీరియాడికల్ పొలిటికల్ డ్రామా పరాశక్తి. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా ఇది. ఈ ‘పరాశక్తి’ తెలుగులోనూ రిలీజైనా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది జనవరి 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.
పరాశక్తి ఓటీటీ రిలీజ్ వివరాలు

శివకార్తికేయన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో నటించిన మూవీ పరాశక్తి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతికి ముందు రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. పరాశక్తి మూవీని ఫిబ్రవరి 7 నుంచి జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.
తమిళంతోపాటు తెలుగులోనూ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు తెలుగులో అసలు ఆదరణ దక్కలేదు.
పరాశక్తి మూవీ స్టోరీ, ఇతర వివరాలు
సుధ కొంగర డైరెక్షన్ లో వచ్చిన సినిమా పరాశక్తి. ఇది 1950ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో సాగే కథ. కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో జరిగిన విద్యార్థి ఉద్యమాలు, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. నిజ జీవిత సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను రాసుకున్నారు.
ఈ మూవీలో రవి మోహన్ విలన్ పాత్రలో నటించగా, శ్రీలీల హీరోయిన్‌గా తమిళంలో అరంగేట్రం చేసింది. అథర్వ సహాయక పాత్రలో కనిపించగా, రానా దగ్గుబాటి, బేసిల్ జోసెఫ్, ధనంజయ్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఇది శివకార్తికేయన్‌కు 25వ సినిమా కాగా, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు ఇది 100వ సినిమా కావడం విశేషం.
నిజానికి ఈ ప్రాజెక్టును మొదట హీరో సూర్య, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, నజ్రియా వంటి భారీ తారాగణంతో అనుకున్నారు. కానీ సూర్య తప్పుకోవడంతో, శివకార్తికేయన్, వేరే నటీనటులతో సినిమాను పూర్తి చేశారు. గతంలో సూర్యతో ఆకాశమే నీ హద్దురా లాంటి హిట్ అందుకున్న సుధ కొంగర ఈ సినిమాతో మాత్రం విమర్శల పాలైంది. ముఖ్యంగా తెలుగు వాళ్లను అవమానించేలా ఇందులో కొన్ని డైలాగులు ఉండటంపైనా విమర్శలు వచ్చాయి.
{{/usCountry}}నిజానికి ఈ ప్రాజెక్టును మొదట హీరో సూర్య, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, నజ్రియా వంటి భారీ తారాగణంతో అనుకున్నారు. కానీ సూర్య తప్పుకోవడంతో, శివకార్తికేయన్, వేరే నటీనటులతో సినిమాను పూర్తి చేశారు. గతంలో సూర్యతో ఆకాశమే నీ హద్దురా లాంటి హిట్ అందుకున్న సుధ కొంగర ఈ సినిమాతో మాత్రం విమర్శల పాలైంది. ముఖ్యంగా తెలుగు వాళ్లను అవమానించేలా ఇందులో కొన్ని డైలాగులు ఉండటంపైనా విమర్శలు వచ్చాయి.
{{/usCountry}}