...
...
Next Story

Sreemukhi: తీసుకెళ్లండి పాపమంటూ శ్రీముఖి కామెంట్.. మా ఇంటి బంగారం మూవీకి భార్యతో భర్త.. వైరల్ గా వీడియో.. ఏం జరిగిందంటే?

Sreemukhi: సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ గా మారింది. శ్రీముఖి చేసిన ఓ కామెంట్ తో ఓ ఇల్లాలి కోరిక నెరవేరింది. మా ఇంటి బంగారం మూవీలో కోడలిగా అదరగొట్టిన శ్రీముఖి.. ఇప్పుడు నెటిజన్ల మనసు కూడా గెలుచుకుంది. అసలు ఆ వీడియోలో ఏముంది? ఏం జరిగింది? అనేది ఇక్కడ చూసేయండి.

Published on: Jun 24, 2026, 09:52:39 IST
Advertisement

Sreemukhi: యాంకర్ గానే కాదు యాక్టర్ గానూ సత్తాచాటగలనని మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీముఖి మరోసారి నిరూపించింది. మా ఇంటి బంగారం మూవీలో తన నటనతో మెప్పించింది. అంతే కాదు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన ఓ కామెంట్ నెటిజన్ల మనసులనూ గెలుచుకుంది. ఆ కామెంట్ సంగతేంటోపూర్తి వివరాలు ఇక్కడున్నాయి.

మా ఇంటి బంగారం

తీసుకెళ్లండి పాపమంటూ శ్రీముఖి కామెంట్.. మా ఇంటి బంగారం మూవీకి భార్యతో భర్త (instagram)
తీసుకెళ్లండి పాపమంటూ శ్రీముఖి కామెంట్.. మా ఇంటి బంగారం మూవీకి భార్యతో భర్త (instagram)

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ చాలా కాలం తర్వాత ఈ మూవీ చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి ఓ హౌస్ వైఫ్ రిక్వెస్ట్ కు శ్రీముఖి రియాక్టవడం వైరల్ గా మారింది.

మీరైనా చెప్పడంటూ

ఇన్ స్టాగ్రామ్ లో ఓ వైఫ్ అండ్ హస్సెండ్ ఫన్నీ అండ్ క్యూట్ వీడియోస్ చేస్తుంటారు. అయితే ఆ భర్తను మా ఇంటి బంగారం మూవీకి తీసుకెళ్లమని ఆ భార్య అడిగింది. సినిమాకు వెళ్తే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, బయట భోజనం అంటావని, అందుకే తీసుకెళ్లనని ఆ భర్త అంటాడు. అప్పుడు ఆ ఇల్లాలు ‘‘శ్రీముఖి మీరైనా చెప్పండి. మా ఆయన్ని సినిమాకు తీసుకెళ్లమని’’ అని వీడియోలో రిక్వెస్ట్ చేసింది.

శ్రీముఖి కామెంట్

నెటిజన్ల ప్రశంసలు

శ్రీముఖి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఓ ఇల్లాలి కోసం శ్రీముఖి కామెంట్ చేయడం గ్రేట్ అని అంటున్నారు. శ్రీముఖిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మా ఇంటి బంగారం గురించి

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా చేసిన మూవీ మా ఇంటి బంగారం. ఇది జూన్ 19న రిలీజైంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో హీరోయిన్ గా సామ్ చేసిన మూవీ. ఇందులో పద్ధతైన కోడలిగా ఉంటూనే, యాక్షన్ సీక్వెన్స్ లో సామ్ అదరగొట్టింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

మరోవైపు ఈ చిత్రంలో శ్రీముఖి కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఇంటి చిన్న కోడలు అనసూయగా నటించింది. పద్ధతైన కోడలిగా మెప్పించింది. మా ఇంటి బంగారం మూవీతో నటిగా శ్రీముఖి కెరీర్ టర్న్ తిరగడం ఖాయమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks