...
...
Next Story

SRH vs RR IPL 2026: ఉప్పల్‌లో వికెట్ల వరద- 10 బంతుల్లోనే 4 వికెట్లు అవుట్- ఎస్ఆర్‌హెచ్ దాటికి కుదేలైన రాజస్థాన్ రాయల్స్

SRH vs RR IPL 2026: ఐపీఎల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ ధాటికి కుప్పకూలింది. కేవలం 10 బంతుల్లోనే ఏకంగా 4 వికెట్లు కోల్పోయి ప్రస్తుతం 5 వికెట్ల నష్టంతో పోరాడుతోంది ఆర్ఆర్.

Published on: Apr 13, 2026, 22:09:27 IST
Advertisement

SRH vs RR IPL 2026: ఉప్పల్ స్టేడియంలో వికెట్ల వరద పారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు స్వింగ్‌తో మాయ చేస్తుంటే, రాజస్థాన్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పరుగుల వేట ప్రారంభించకముందే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది.

సాకిబ్ హుస్సేన్ దెబ్బ.. జైస్వాల్ అవుట్

ఉప్పల్‌లో వికెట్ల వరద- 10 బంతుల్లోనే 4 వికెట్లు అవుట్-  ఎస్ఆర్‌హెచ్ దాటికి కుదేలైన రాజస్థాన్ రాయల్స్
ఉప్పల్‌లో వికెట్ల వరద- 10 బంతుల్లోనే 4 వికెట్లు అవుట్- ఎస్ఆర్‌హెచ్ దాటికి కుదేలైన రాజస్థాన్ రాయల్స్

వరుసగా డాట్ బాల్స్ వేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన యువ పేసర్ సాకిబ్ హుస్సేన్, చివరకు యశస్వి జైస్వాల్‌ను బోల్తా కొట్టించాడు. సాకిబ్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన జైస్వాల్, టైమింగ్ కుదరక డీప్‌లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం 3.4 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 15/5గా నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాకుండా మొదటి 10 బాల్స్‌లోనే ఏకంగా 4 వికెట్లు పడటం రాజస్థాన్ రాయల్స్‌తో కోలుకోలేని దెబ్బగా మారింది. అనంతరం వచ్చిన యశస్వి జైస్వాల్ కూడా 1 పరుగుకే వెనుదిరగడం ఆర్ఆర్‌కు మరింత పీకల్లోతు కష్టాల్లోకి పడిపోయింది.

కష్టాల్లో రాయల్స్.. ఆదుకునేది ఎవరు?

ఐదు వికెట్లు కోల్పోయిన తరుణంలో వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు. రెండు పరుగులు తీసి ఖాతా తెరిచినప్పటికీ, అవతలి వైపు వికెట్లు పడుతుండటంతో రాజస్థాన్ శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. సన్‌రైజర్స్ యువ బౌలర్లు సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి తమ పదునైన బంతులతో రాజస్థాన్ పతనాన్ని శాసిస్తున్నారు. భారీ స్కోరును ఛేదించాల్సిన సమయంలో ఇలాంటి ఆరంభం లభించడం రాజస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ.

1. రాజస్థాన్ రాయల్స్ స్కోరు ఎంత వద్ద 5 వికెట్లు కోల్పోయింది?

సన్‌రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కేవలం 15 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది.

2. యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేసిన బౌలర్ ఎవరు?

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో జైస్వాల్‌ను అవుట్ చేశాడు.

3. సన్‌రైజర్స్ ఎంత లక్ష్యాన్ని నిర్దేశించింది?

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe