Srikanth Odela: ‘దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది పారడైజ్' సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో టీమ్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల ఓ విషయాన్ని బయటపెట్టాడు.
కారులో విలన్ తో

ది ప్యారడైజ్ మూవీలో ప్రముఖ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అతనితో కలిసి కార్ డ్రైవ్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ షూట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో రాఘవ్ జుయల్‌తో కలిసి సినిమా విశేషాలే కాకుండా తన సినీ ప్రయాణంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను శ్రీకాంత్ పంచుకున్నాడు.
శ్రీకాంత్ ఓదెల లాకెట్ స్టోరీ
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన మెడలోని లాకెట్ స్టోరీ గురించి వెల్లడించాడు. 'రంగస్థలం' సినిమాకు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాస్ట్యూమ్స్ విభాగాన్ని పర్యవేక్షించిన శ్రీకాంత్ ఓదెల.. ఆ సినిమా షూటింగ్ చివరి రోజున రామ్ చరణ్ తనకు గిఫ్ట్ ఇచ్చాడని తెలిపాడు.
"రామ్ చరణ్ అన్న కోసం మెగాస్టార్ చిరంజీవి చెన్నైలో ప్రత్యేకంగా ఒక లాకెట్ చేయించారు. రంగస్థలం లాస్ట్ డే షూట్ రోజు చరణ్ అన్న ఆ లాకెట్‌ను నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ రోజు నుంచి నేను దానిని ఇప్పటివరకు మెడలో నుంచి తీయలేదు’’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
వైరల్ వీడియో
‘‘అయితే, ఈ మధ్యే నేను చరణ్ అన్నను కలిసి ఆ లాకెట్ గురించి మాట్లాడితే.. 'నేను నీకు అది ఇచ్చానా?' అని ఆయన పూర్తిగా మరచిపోయి ఆశ్చర్యపోయారు" అని శ్రీకాంత్ ఓదెల నవ్వుతూ వెల్లడించాడు. శ్రీకాంత్ అభిమానం, చరణ్ ప్రేమతో కూడిన ఈ సరదా ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
హైప్ పెంచేలా
{{/usCountry}}‘‘అయితే, ఈ మధ్యే నేను చరణ్ అన్నను కలిసి ఆ లాకెట్ గురించి మాట్లాడితే.. 'నేను నీకు అది ఇచ్చానా?' అని ఆయన పూర్తిగా మరచిపోయి ఆశ్చర్యపోయారు" అని శ్రీకాంత్ ఓదెల నవ్వుతూ వెల్లడించాడు. శ్రీకాంత్ అభిమానం, చరణ్ ప్రేమతో కూడిన ఈ సరదా ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
హైప్ పెంచేలా
{{/usCountry}}ఒక యంగ్ డైరెక్టర్ సాధారణ ప్రెస్ మీట్‌లకు భిన్నంగా తన విలన్ (రాఘవ్ జుయల్) తో కలిసి కార్ డ్రైవ్ చేస్తూ క్యాజువల్ ముచ్చట పెట్టడం డిజిటల్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఇంటర్వ్యూతో ది ప్యారడైజ్ మూవీపై మరింత హైప్ పెరిగిందనే చెప్పొచ్చు.
రాఘవ్ గురించి
బాలీవుడ్‌లో 'కిల్' (Kill) సినిమాతో విలన్‌గా మెప్పించిన రాఘవ్ జుయల్ ది ప్యారడైజ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో నానికి విలన్ గా అతను నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.