టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇప్పుడు అతడు మరో ఆసక్తికరమైన మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. అదే 'మృత్యుంజయ' (Mrithyunjay). ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన హుస్సేన్ షా కిరణ్ (Hussain Sha Kiran) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
రాజమౌళి ప్రశంసలు.. టీజర్ అదిరింది!

బుధవారం (ఫిబ్రవరి 11) మృత్యుంజయ మూవీ టీమ్ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. విశేషమేమిటంటే.. భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన 'ఎక్స్' అకౌంట్ ద్వారా ఈ టీజర్‌ను లాంచ్ చేశాడు. అంతేకాకుండా టీజర్ చాలా బాగుందంటూ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. జక్కన్న సపోర్ట్ దొరకడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఒక మనిషి తనలో మూడు విషయాలను మార్చుకోలేడు.. ఒకటి హైట్.. రెండోది చూసే చూపు.. మూడోది అంటూ శ్రీవిష్ణు వాయిస్ తో టీజర్ మొదలైంది. నిమిషంలోపే ఉన్నా చాలా ఉత్కంఠగా సాగింది.
మృత్యుంజయ మూవీ కథేంటంటే..
టీజర్ చూస్తుంటే ఇదొక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. అద్భుతమైన విజువల్స్‌తో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథ విషయానికి వస్తే.. ఒక నేరం జరుగుతుంది. అది చూసిన అందరూ దాన్ని కేవలం ప్రమాదం అని నమ్ముతారు. కానీ హీరో శ్రీ విష్ణు మాత్రం అది కచ్చితంగా హత్యే అని బలంగా వాదిస్తాడు.
అసలు ఆ నేరానికి, హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అందరూ ప్రమాదం అని అంటుంటే, హీరో దాన్ని హత్య అని ఎలా నిరూపిస్తాడు? ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు దోషులు ఎవరు? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఫిబ్రవరి 27న వెండితెరపై సమాధానం దొరకనుంది.
కామెడీ నుంచి సీరియస్ మోడ్‌లోకి..
{{/usCountry}}అసలు ఆ నేరానికి, హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అందరూ ప్రమాదం అని అంటుంటే, హీరో దాన్ని హత్య అని ఎలా నిరూపిస్తాడు? ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు దోషులు ఎవరు? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఫిబ్రవరి 27న వెండితెరపై సమాధానం దొరకనుంది.
కామెడీ నుంచి సీరియస్ మోడ్‌లోకి..
{{/usCountry}}గత కొంతకాలంగా శ్రీ విష్ణు ఎక్కువగా కామెడీ డ్రామాలు, ఎంటర్టైనింగ్ పాత్రలే చేస్తున్నాడు. కానీ చాలా రోజుల తర్వాత అతడు పూర్తిస్థాయి సీరియస్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తుండటం విశేషం. ఈ మార్పు ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కీలక పాత్రలో నటిస్తోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్', 'కార్తికేయ 2' ఫేమ్ కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.