Baabubali: ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తోందంటే దానికి మూలకారణం ‘బాహుబలి’. ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర లిఖించింది. కానీ, ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలైన రోజున వచ్చిన టాక్ చూసి తమ కెరీర్ ఇక ముగిసిపోయిందని మూవీ యూనిట్ టెన్షన్ పడిందంటా. దీనికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను చిత్ర యూనిట్ తాజాగా పంచుకుంది.
మైండ్ బ్లాక్

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన బాహుబలి ది టార్చ్ బేరర్స్ డాక్యుమెంటరీలో బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ డే నాటి పరిస్థితిని రాజమౌళి తలుచుకున్నాడు. "హిందీ, యూఎస్, గల్ఫ్ దేశాల నుంచి బాహుబలికి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. కానీ, మాకు అసలైన రెవెన్యూ రావాల్సింది ఆంధ్రా, తెలంగాణల నుంచే. అక్కడ మాత్రం మొదటి రోజే అత్యంత దారుణమైన రివ్యూలు వచ్చాయి’’ అని రాజమౌళి చెప్పాడు.
‘‘శివుడి పాత్రలో ఉన్న ప్రభాస్.. శివలింగానికి బదులు జండూ బామ్ పట్టుకున్నట్లు ఉన్న ఒక మీమ్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది’’ అని జక్కన్న అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకున్నాడు.
ఆ మెసేజ్ తో
రాజమౌళికి తన డిస్ట్రిబ్యూటర్లలో ఒకరి నుంచి వచ్చిన మెసేజ్ మూవీ టీమ్ ను మరింత భయపెట్టింది. "భారతీయ సినిమా చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ అని ఇండస్ట్రీ వాళ్లు మాట్లాడుకుంటున్నారు" అనే మెసేజ్‌లు రావడంతో.. తమ కెరీర్స్ ముగిసిపోయాయని రాజమౌళి అండ్ టీమ్ గదిలోనే ఉండిపోయారు.
ప్రభాస్ ఏమన్నాడంటే?
ఆ రోజును గుర్తుచేసుకుంటూ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఎమోషనల్ అయ్యాడు. "అదొక యుద్ధం.. ఆ రోజు అసలు నిర్మాతలు ఎలా బతికి బట్టకట్టారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు" అని ప్రభాస్ అన్నాడు.
ప్రతిరోజూ ఒక యుద్ధమే!
{{/usCountry}}ఆ రోజును గుర్తుచేసుకుంటూ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఎమోషనల్ అయ్యాడు. "అదొక యుద్ధం.. ఆ రోజు అసలు నిర్మాతలు ఎలా బతికి బట్టకట్టారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు" అని ప్రభాస్ అన్నాడు.
ప్రతిరోజూ ఒక యుద్ధమే!
{{/usCountry}}ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించిన శోబు యార్లగడ్డ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభించినప్పుడు తమకు ఎలాంటి ఫిక్స్‌డ్ బడ్జెట్ లేదని వెల్లడించారు. మరుసటి రోజు షూటింగ్‌కు అవసరమైన డబ్బులను సర్దడానికి ప్రతిరోజూ ఎంతో కష్టపడేవారమని చెప్పారు.
"కొన్ని రోజుల తర్వాత, ప్రతిరోజూ అయ్యే ఖర్చు రూ.25 లక్షలు దాటిపోయింది. మేము కేవలం నాలుగు రోజులు తీసిన వార్ సీక్వెన్స్ ఖర్చుతో.. 12 ఏళ్ల క్రితం ఒక చిన్న సినిమా మొత్తాన్ని నిర్మించవచ్చు. అంటే ప్రతి నాలుగు రోజులకు దాదాపు రూ.1 కోటి ఖర్చవుతుండేది" అని శోబు ఆనాటి పరిస్థితులను వివరించారు.
రూ.70 కోట్ల లోటుతో
సినిమా అంతా పూర్తి చేసి థియేటర్లలోకి తెచ్చే సమయానికి పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. "మొదటి భాగం విడుదలయ్యే రోజుకు మాకు ఇంకా రూ.70 కోట్ల డెఫిసిట్ (లోటు) ఉంది. మేము పెట్టిన పెట్టుబడికి, థియేట్రికల్ రైట్స్ ద్వారా రికవరీ అయిన దానికి మధ్య అంత భారీ వ్యత్యాసం ఉంది" అని శోబు యార్లగడ్డ గుర్తుచేసుకున్నారు.
ఏడ్చేసిన కార్తికేయ
అసోసియేట్ ప్రొడ్యూసర్, శోబు కుమారుడు కార్తికేయ యార్లగడ్డ ఆనాటి భయాన్ని గుర్తుచేసుకున్నాడు. "ట్విట్టర్‌లో అప్పటికే జనాలు మమ్మల్ని దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మేము పూర్తిగా విరిగిపోయే స్థితికి వచ్చాం. నేను ఏడుస్తూ పైకి వెళ్తుండగా, కారిడార్‌లో నాన్న (శోబు) కనిపించారు. ఆయనను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశా" అని కార్తికేయ చెప్పాడు.
సాయంత్రానికి మారిన టాక్
అయితే ఫస్ట్ డే సాయంత్రం షోల సమయానికి థియేటర్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రేక్షకుల నుంచి 'మౌత్ టాక్' పాజిటివ్‌గా రావడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఆ తర్వాతి వారంలో తెలుగు రాష్ట్రాల్లోని బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.
2015లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'బాహుబలి 2: ది కంక్లూజన్' మరింత పెద్ద సంచలనమై.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,788 కోట్లు వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.