Rajamouli Varanasi: ఇంటర్నేషనల్ రేంజ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ విజువల్ వండర్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘వారణాసి’ అనే భారీ అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ స్టోరీని లీక్ చేస్తూ రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
రాజమౌళి కామెంట్లు

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హైప్ మరింత పెంచేలా వారణాసి గురించి రాజమౌళి కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్ లభించడంతో, రాజమౌళి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక ప్రత్యేక మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్న జక్కన్న.. మహేష్ బాబు సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సీక్వెల్స్ లేవు.. ఒకే ఒక్క భాగం
సాధారణంగా రాజమౌళి గత చిత్రాలైన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలకు సీక్వెల్స్, ఫ్రాంచైజీల టాక్ నడుస్తోంది. కానీ, మహేష్ బాబుతో తీస్తున్న ‘వారణాసి’ చిత్రం మాత్రం కేవలం ఒకే ఒక స్టాండ్‌అలోన్ చిత్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనిని వేరే ఏ భాగాలతోనూ పొడిగించే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
ఆఫ్రికా అడవుల నుంచి అంటార్కిటికా మంచు వరకు
వారణాసి సినిమా ఏ నేపథ్యంలో సాగుతుంది? కథాంశం ఏంటి? అనే ప్రశ్నలకు రాజమౌళి మొదటిసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్‌గా కనిపిస్తున్నప్పటికీ, దీని ఆత్మ మాత్రం భారతీయులకు నచ్చే ఎమోషన్ అని చెప్పారు.
సినిమాలోని ఎలిమెంట్స్
"ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికాలోని విపరీతమైన చలి వరకు, రామాయణంలోని దేవుళ్లు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్.. ఇలా ఇవన్నీ ఒకే సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే వారణాసి సినిమాకు మూలం మాత్రం తండ్రీకొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్. దాని నుంచే ఇవన్నీ వస్తాయి’’ అని రాజమౌళి వివరించారు.
{{/usCountry}}"ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికాలోని విపరీతమైన చలి వరకు, రామాయణంలోని దేవుళ్లు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్.. ఇలా ఇవన్నీ ఒకే సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే వారణాసి సినిమాకు మూలం మాత్రం తండ్రీకొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్. దాని నుంచే ఇవన్నీ వస్తాయి’’ అని రాజమౌళి వివరించారు.
{{/usCountry}}రాజమౌళి ఇచ్చిన ఈ లేటెస్ట్ హింట్లతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మూవీ వేరే లెవల్ లో ఉండబోతుందనే చర్చ జోరందుకుంది.
అక్టోబర్ కల్లా షూట్ ప్యాకప్
ఇప్పటికే విడుదలైన ‘వారణాసి’ గ్లోబల్ టీజర్ ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ దృష్టిని ఆకర్షించింది. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది (2026) అక్టోబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
ఈ అంతర్జాతీయ అడ్వెంచర్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా, మాలీవుడ్ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.