Rajamouli Ramayana Review: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణం’ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన భారతదేశపు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా జీవించిన తీరును, యశ్ రావణాసురుడిగా చూపించిన గంభీరమైన ప్రెజెన్స్‌ను జక్కన్న ఆకాశానికెత్తేశారు.
రణబీర్ కపూర్ నటనపై రాజమౌళి ప్రశంసల వర్షం

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో రాజమౌళి పోస్ట్ చేస్తూ సినిమా విజువల్ స్కేల్‌ను, నటీనటుల పనితీరును అభినందించారు.
“రామాయణ.. సినిమా స్కేల్, బిగ్ స్క్రీన్ విజువల్స్ చూస్తుంటే చాలా అద్బుతంగా ఉన్నాయి. ముఖ్యంగా వనవాసం ఘట్టం నుంచి రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో చాలా ప్రశాంతంగా, అదే సమయంలో ఎంతో రాజసంగా కనిపించారు. రావణాసురుడిగా యశ్ చూపించిన భయంకరమైన ప్రెజెన్స్, సీతాదేవిగా సాయి పల్లవి ఒదిగిపోయిన తీరు చాలా బాగున్నాయి. ప్రి-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కటీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంతటి ఊహకందని విజన్ ను తెరపైకి తీసుకొచ్చిన నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీ అండ్ టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు.” అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ట్రైలర్ నుంచే రామాయణానికి జక్కన్న సపోర్ట్
రాజమౌళి ఈ సినిమాను అభినందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ‘రామాయణం’ ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా ఆయన స్పందించారు. “ప్రతి ఇండియన్ స్టోరీ టెల్లర్ తెరపై ఆవిష్కరించాలని కలలు కనే మహాకావ్యం రామాయణం. అలాంటి ఇతిహాసాన్ని నితేష్ తివారీ, నమిత్ మల్హోత్రా అత్యంత భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకురావడం నిజంగా అభినందనీయం” అని రాజమౌళి గతంలోనే మేకర్స్ విజన్‌ను ప్రశంసించారు.
రాజమౌళి - మహేష్ బాబు 'వారాణాసి'కి రామాయణం కనెక్షన్
మరోవైపు రాజమౌళి ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో తెరకెక్కించబోయే పాన్-వరల్డ్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ‘వారాణాసి’ (Varanasi) పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి రామాయణంతో విడదీయరాని సంబంధం ఉందనే విషయాన్ని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
{{/usCountry}}మరోవైపు రాజమౌళి ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో తెరకెక్కించబోయే పాన్-వరల్డ్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ‘వారాణాసి’ (Varanasi) పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి రామాయణంతో విడదీయరాని సంబంధం ఉందనే విషయాన్ని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
{{/usCountry}}తన ప్రతీ సినిమాలోనూ శ్రీరాముడి కథాంశాల ప్రేరణ ఉంటుందని, కానీ ఈ 'వారాణాసి' చిత్రంలో ఏకంగా రామాయణంలోని ఒక నిజమైన ఘట్టాన్ని తీసుకుని ప్రత్యేకమైన శైలిలో తెరపై ఆవిష్కరించబోతున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించిన రామాయణలాంటి మైథలాజికల్ అడ్వెంచర్‌కు జక్కన్న లాంటి దిగ్గజ దర్శకుడి నుంచి లభించిన ఈ ప్రశంసలు, సౌత్ బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా మేనియాను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. రామాయణ పార్ట్ 2ను వచ్చే ఏడాది కాకుండా 2028లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే.