Rajamouli: మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళి సినిమా వస్తోందంటేనే భారతీయ సినీ ఇండస్ట్రీతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక భారీ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం ‘వారణాసి’ని తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, ఇదే సమయంలో రాజమౌళి కెరీర్‌లోనే మైలురాళ్లుగా నిలిచిన రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సీక్వెల్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ రెండు సినిమాలు

ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ను టాలీవుడ్ వైపు చూసేలా చేసిన సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లేలా, సీక్వెల్స్ కు బలమైన పునాదులు పడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. తాజాగా రానా, ప్రభాస్ హింట్ తో సోషల్ మీడియా మోత మోగిపోతోంది.
‘RRR’ సీక్వెల్!
జపాన్‌లో జరిగిన ‘RRR’ ప్రత్యేక ప్రదర్శన సమయంలో స్వయంగా రాజమౌళి ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. "నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కానీ ఈ టైమ్ లో వాటిని పూర్తిగా పంచుకోలేను" అని రాజమౌళి హింట్ ఇచ్చారు.
ఆఫ్రికా నేపథ్యంలో
మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్ర కథా రచయిత, రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ గతంలో ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ‘RRR’ పార్ట్ 2 కోసం ఆయన ఒక అద్భుతమైన లైన్ అనుకున్నారట. అందులో ప్రధాన పాత్రలైన అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్), కొమరం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) తమ విప్లవాత్మక ప్రయాణాన్ని ఆఫ్రికా ఖండంలో కొనసాగిస్తారని ఆయన వెల్లడించారు. ఈ కాన్సెప్ట్ రాజమౌళికి బాగా నచ్చడంతో, దీనిని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా డెవలప్ చేయమని విజయేంద్ర ప్రసాద్‌ను కోరినట్లు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీతో
సినిమా ప్రియులను ఊపేస్తున్న మరో సంచలన వార్త ఏంటంటే.. ‘బాహుబలి పార్ట్ 3’ (Baahubali 3) కూడా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ (Baahubali: The Torchbearer) డాక్యుమెంటరీలో చిత్ర ప్రధాన తారాగణం ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టిలు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ఆ హింట్ తో
{{/usCountry}}సినిమా ప్రియులను ఊపేస్తున్న మరో సంచలన వార్త ఏంటంటే.. ‘బాహుబలి పార్ట్ 3’ (Baahubali 3) కూడా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ (Baahubali: The Torchbearer) డాక్యుమెంటరీలో చిత్ర ప్రధాన తారాగణం ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టిలు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ఆ హింట్ తో
{{/usCountry}}"ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెప్పవచ్చో లేదో తెలీదు, కానీ ప్రస్తుతం రాజమౌళి, శోభు ఇక్కడ లేరు కాబట్టి నా మనసులో ఉన్నది చెప్పేస్తాను. ఈ ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు, కానీ ‘బాహుబలి’ నుంచి మరిన్ని విశేషాలు రాబోతున్నాయి" అని రానా అన్నాడు.
రానా అలా అనగానే పక్కనే ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ నవ్వుతూ తన మూడు వేళ్లను (3) చూపించి, ‘బాహుబలి 3’ రాబోతుందనే విషయాన్ని సైగలతో హింట్ ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారడంతో పాటు డాక్యుమెంటరీ ముగింపులో "ది లెగసీ కంటిన్యూస్" అని బోర్డు పడటం అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కనుక భవిష్యత్తులో సెట్స్ పైకి వెళ్తే వేరే లెవల్ లో ఉంటుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ మునుపెన్నడూ చూడని స్థాయి క్రేజ్, రికార్డులను సాకారం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.