...
...
Next Story

ఫ్యాన్స్ గెట్ రెడీ-స్టార్ మా సీరియల్స్ స్టార్లందరూ వచ్చేస్తున్నారు-మల్కాజిగిరిలో గ్రాండ్ ఈవెంట్-ఓ లుక్కేయండి

స్టార్ మా సీరియల్స్ ఫ్యాన్స్ గెట్ రెడీ. మీ అభిమాన సీరియల తారలంతా ఒకే చోట చేరబోతున్నారు. మీ ముందుకు రాబోతున్నారు. పొదరిల్లు సీరియల్ గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ కు వస్తున్నారు. దీనికి మీరు కూడా వెళ్లొచ్చు.

Published on: Jan 23, 2026, 18:22:20 IST
Advertisement

స్టార్ మాలో వచ్చే సీరియల్స్ కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. టాప్ సీరియల్ కార్తీక దీపం 2 నుంచి గుండె నిండా గుడి గంటల వరకు ఈ ధారవాహికలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడీ ఈ సీరియల్స్ స్టార్లందరూ కలిసి ఒకే చోట కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. వచ్చే ఆదివారం అదే జరగబోతుంది. పొదరిల్లు సీరియల్ జంట గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన కు వీళ్లందరూ రాబోతున్నారు.

పొదరిల్లు సీరియల్

స్టార్ మా సీరియల్స్ నటులు
స్టార్ మా సీరియల్స్ నటులు

టెలివిజన్ సీరియల్ చరిత్రలో బహుశా మొదటి సారి అనుకుంటా ఓ సీరియల్ లోని వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఇతర సీరియల్ స్టార్లందరూ రాబోతున్నారు. హైదరాబాద్లో కనీవిని ఎరుగని టెలివిజన్ మహోత్సవం జనవరి 25 ఆదివారం నాడు జరగబోతుంది. స్టార్ మా సీరియల్ అయిన ‘పొదరిల్లు’ జంట గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్, అనుటెక్స్ చౌరస్తా, మల్కాజిగిరి, హైదరాబాద్ లో జరగనుంది.

సీరియల్స్ స్టార్స్

స్టార్ మా ఛానల్లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రముఖ సీరియల్ ‘పొదరిల్లు’ హీరో, హీరోయిన్ వివాహ సందర్భంగా నిర్వహిస్తున్న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు హైదరాబాద్ నగర ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఈ శుభసందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు స్టార్ మా లో ప్రసారమవుతున్న అన్ని ప్రముఖ సీరియల్స్ నటీనటులు ఒకే వేదికపై తొలిసారి సందడి చేయనున్నారు.

కార్తీక దీపం 2 నటులు

తెలుగు సీరియల్స్ లో ఇప్పుడు కార్తీక దీపం 2 టాప్ లో కొనసాగుతోంది. ఇందులో నిరుపమ్ కార్తీక్ గా, ప్రేమి విశ్వనాథ్ దీపగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా పొదరిల్లు జోడీ గ్రాండ్ రిసెప్షన్ గా వస్తున్నారు. టీవీలో ప్రతి ఇంటిని పలకరిస్తున్న కార్తీక దీపం 2 నటులను లైవ్ గా చూసేందుకు ఫ్యాన్స్ కు ఇదే మంచి అవకాశం. ఇకా తమ అభిమాన హీరో–హీరోయిన్ను ఆశీర్వదించడానికి, శుభాకాంక్షలు తెలపడానికి స్టార్ మా కుటుంబం మొత్తం ఈ వేడుకకు హాజరుకానుంది.

ఇదో పండగ

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks