స్టార్ మా ఛానెల్లో వచ్చే రెండు పాపులర్ సీరియల్స్ చిన్ని, నువ్వు లేక నేను లేను టెలికాస్ట్ అయ్యే టైమింగ్స్ మారిపోయినట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. ఈ విషయాన్ని స్టార్ మా సోమవారం (ఫిబ్రవరి 16) తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది. వీటి కొత్త టైమింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి.
మారిపోయిన టైమింగ్స్

స్టార్ మా తన ఛానెల్లో వచ్చే సీరియల్స్ టైమింగ్స్, ఎపిసోడ్ డ్యూరేషన్ విషయంలో కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పటికే రెండు సీరియల్స్ ను అరగంటకు బదులుగా 45 నిమిషాలకు చేయగా.. ఇప్పుడు చిన్ని, నువ్వు లేక నేను లేను సీరియల్స్ టైమింగ్స్ మార్చేసింది.
సోమవారం (ఫిబ్రవరి 16) చిన్ని సీరియల్ సాయంత్రం 7 గంటలకు బదులుగా సాయంత్రం 6 గంటలకే టెలికాస్ట్ అవుతుంది. ఇక నువ్వు లేక నేను లేను రాత్రి 10 గంటలకు బదులుగా సాయంత్రం 7 గంటలకే వస్తుంది. ఈ రెండు సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమవుతాయి.
ఆ రెండు సీరియల్స్ ఇక 45 నిమిషాలు
ఇక ఇప్పటికే స్టార్ మా ఛానెల్ రెండు టాప్ సీరియల్స్ ఎపిసోడ్ డ్యూరేషన్ పెంచిన విషయం తెలిసిందే. రాత్రి 9 గంటలకు వచ్చే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అరగంటకు బదులుగా 45 నిమిషాలు టెలికాస్ట్ కానుంది. ఇక పొదరిల్లు సీరియల్ 9.45 గంటలకు మొదలై 10.30 గంటల వరకు కొనసాగనుంది. ఈ విషయాన్ని గత వారమే ఆ ఛానెల్ వెల్లడించింది. ఈ రెండు మార్పులు కూడా సోమవారం (ఫిబ్రవరి 16) నుంచే అమల్లోకి వచ్చాయి.
స్టార్ మాలో వచ్చే సీరియల్సే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. టీఆర్పీ రేటింగ్స్ పరంగా కూడా టాప్ 10 సీరియల్స్ లో ఆరు స్టార్ మా ఛానెల్ కు చెందినవే ఉంటూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు టైమింగ్స్, ఎపిసోడ్ సమయాల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఈ సీరియల్స్ ను మరింత జనరంజకంగా మార్చే ప్రయత్నం స్టార్ ఛానెల్ చేస్తోంది.
{{/usCountry}}స్టార్ మాలో వచ్చే సీరియల్సే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. టీఆర్పీ రేటింగ్స్ పరంగా కూడా టాప్ 10 సీరియల్స్ లో ఆరు స్టార్ మా ఛానెల్ కు చెందినవే ఉంటూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు టైమింగ్స్, ఎపిసోడ్ సమయాల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఈ సీరియల్స్ ను మరింత జనరంజకంగా మార్చే ప్రయత్నం స్టార్ ఛానెల్ చేస్తోంది.
{{/usCountry}}