...
...
Next Story

డైరెక్టర్‌పై పోలీస్ కేసు-సుడిగాలి సుధీర్ ప్ర‌మోష‌న్ల‌కు రావాలి-అతని పేరెంట్స్ మంచోళ్లు: గోట్ నిర్మాత చంద్రశేఖర్

సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ ‘గోట్’. అయితే ఈ మూవీ డైరెక్టర్, హీరోతో విభేధాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై మూవీ నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Dec 3, 2025, 06:17:06 IST
Advertisement

స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు వెళ్లిన నటుడు సుడిగాలి సుధీర్. బజర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకుని, సినిమాల్లో చిన్న క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. అయితే అతని అప్ కమింగ్ మూవీ గోట్ (G.O.A.T) మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నాడు సుధీర్.

ప్రమోషన్లకు దూరంగా సుధీర్

గోట్ మూవీ పోస్టర్ (x/sudheeranand)
గోట్ మూవీ పోస్టర్ (x/sudheeranand)

సుధీర్, దివ్య భారతి జంటగా తెరకెక్కుతున్న సినిమా గోట్. పాగల్ సినిమా ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ రెండున్నరేళ్ల కిందటే స్టార్ట్ అయింది. కానీ డైరెక్టర్, నిర్మాత, హీరో మధ్య విభేధాలు ఈ మూవీకి అడ్డంకిగా మారాయి. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ‘ఓడియమ్మా’ సాంగ్, టీజర్ లాంఛ్ చేశారు. కానీ ఈ ఈవెంట్లకు సుధీర్ దూరంగా ఉన్నాడు. ప్రమోషన్లకు రావడం లేదు. దీనిపై ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేరెంట్స్ మంచోళ్లు

‘గోట్’ సినిమా టీజర్ ను రీసెంట్ గా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ మూవీకి సపోర్ట్ చేయడం లేదా అనే ప్రశ్న ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ కు ఎదురైంది. దీనిపై నిర్మాత రియాక్టయ్యాడు.

‘‘సుధీర్ ఫ్యామిలీ, పేరెంట్స్ చాలా మంచోళ్లు. సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే ఈ సినిమా చేశా. ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. బడ్జెట్ ఎక్కువ పెడుతున్నాం కాబట్టి సినిమాకు న్యాయం చేస్తాడని హీరోగా తీసుకున్నాం. సినిమాను కరెక్ట్ చేసుకోవడానికి టైమ్ పట్టింది. ఈ విషయం ఛాంబర్ లో నడుస్తోంది. నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రమోషన్లకు సుధీర్ రావాలని మీడియా ద్వారా కోరుతున్నా’’ అని చంద్రశేఖర్ అన్నాడు.

పోలీస్ కేసు

గతంలో ఆయన్ని సినిమాల నుంచి తొలగించారు. సుధీర్ రిక్వెస్ట్ చేస్తే బడ్జెట్ రూ.కోటికి పెంచా. ఇది సుధీర్ సినిమా. అతను ప్రమోట్ చేయాలని కోరుతున్నా’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe