ఓటీటీలో ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అదరగొడుతోంది. ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. అదే ‘దివ్య దృష్టి’. కమెడియన్ సునీల్ క్రూరమైన విలన్ గా నటించిన సినిమా ఇది. ఇది డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైంది. అదిరిపోయే ట్విస్ట్ తో లాస్ట్ లో థ్రిల్ పంచే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
దివ్య దృష్టి ఓటీటీ

సునీల్, ఈషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ దివ్య దృష్టి. ఇది డిసెంబర్ 19న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ ఓటీటీలో ఇండియాలో నంబర్ వన్ సినిమాగా దివ్య దృష్టి స్ట్రీమింగ్ అవుతోంది.
క్రూరమైన విలన్
సునీల్ అంటే ఒకప్పటి టాప్ కమెడియన్. తన మార్కు కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు. ఆ తర్వాత హీరోగా ఓ టర్న్ తీసుకున్నాడు. అక్కడి నుంచి విలన్ గా మారాడు. పుష్ప సినిమాల్లో మంగళం శీనుగా అదరగొట్టాడు. ఇప్పుడు దివ్య దృష్టిలో మరింత క్రూరమైన విలన్ గా నటించాడు. తన యాక్టింగ్ తో ప్రేక్షకులను భయపెట్టాడు. ఇందులో ఈషా చావ్లా ట్విన్స్ గా కనిపిస్తుంది.
దివ్య దృష్టి స్టోరీ
దివ్య, భవ్య (ఈషా చావ్లా) ట్విన్ సిస్టర్స్. వీళ్ల కళ్లకు ఓ వ్యాధి ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ కు గురైతే చూపు పోతుంది. అలాగే భవ్యకు చూపు పోతుంది. ఆమె ఇంట్లో సూసైడ్ చేసుకుంటుంది. కానీ భవ్య చావు వెనుకాల ఏదో మిస్టరీ ఉందని దివ్య కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో దివ్య భర్త సందీప్ (కమల్ కామరాజు) కూడా కనిపించకుండా పోతాడు. అతను కూడా సూసైడ్ చేసుకోవడం చూసి దివ్యకు చూపు పోతుంది.
దివ్యకు ఆపరేషన్ చేస్తారు. కేర్ టేకర్ అజయ్ (సునీల్) ఆమె ఇంట్లోకి వస్తాడు. దివ్యకు దగ్గరవుతాడు. కానీ ఓ రోజు దివ్యకు అసలు నిజం తెలుస్తుంది. భవ్య, సందీప్ ను చంపింది అజయ్ అలియాస్ అనిల్ అని తెలుసుకుంటుంది. భవ్య మీద ప్రేమతోనే అలా చేశాడని, దివ్యను కూడా లవ్ చేస్తున్నాడనే ట్విస్ట్ బయటపడుతుంది. చూపు లేని తన తల్లికి చూపు వచ్చిందనే విషయం తెలుసుకుని ఆ కళ్లను పొడిచేస్తాడు అనిల్. మరి చివరకు అనిల్ కు దివ్య దొరికిందా? అన్నది దివ్య దృష్టి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
{{/usCountry}}దివ్యకు ఆపరేషన్ చేస్తారు. కేర్ టేకర్ అజయ్ (సునీల్) ఆమె ఇంట్లోకి వస్తాడు. దివ్యకు దగ్గరవుతాడు. కానీ ఓ రోజు దివ్యకు అసలు నిజం తెలుస్తుంది. భవ్య, సందీప్ ను చంపింది అజయ్ అలియాస్ అనిల్ అని తెలుసుకుంటుంది. భవ్య మీద ప్రేమతోనే అలా చేశాడని, దివ్యను కూడా లవ్ చేస్తున్నాడనే ట్విస్ట్ బయటపడుతుంది. చూపు లేని తన తల్లికి చూపు వచ్చిందనే విషయం తెలుసుకుని ఆ కళ్లను పొడిచేస్తాడు అనిల్. మరి చివరకు అనిల్ కు దివ్య దొరికిందా? అన్నది దివ్య దృష్టి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
{{/usCountry}}