ఓటీటీని షేక్ చేస్తున్న వరుణ్ సందేశ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్-ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌-క‌ళ్లద్దాల‌తో సీక్రెట్స్

వరుసగా సినిమాలు చేస్తున్నా థియేటర్లో సక్సెస్ అందుకోలేకపోతున్న హీరో వరుణ్ సందేశ్ ఓటీటీ బాట పట్టాడు. అతను లీడ్ రోల్ ప్లే చేసిన వెబ్ సిరీస్ నయనం ఓటీటీలో అదరగొడుతోంది. నంబర్ వన్ సిరీస్ గా ట్రెండ్ అవుతోంది. 

Published on: Dec 21, 2025, 13:45:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. అదే వరుణ్ సందేశ్ లీడ్ రోల్ ప్లే చేసిన నయనం. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ సిరీస్ సత్తాచాటుతోంది. థియేటర్లో వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న వరుణ్ సందేశ్.. ఈ సిరీస్ తో ఓటీటీలో మాత్రం గ్రాండ్ గా డెబ్యూ చేశాడు.

ఓటీటీ ట్రెండింగ్ లో నయనం సిరీస్ (x/ZEE5Telugu)
ఓటీటీ ట్రెండింగ్ లో నయనం సిరీస్ (x/ZEE5Telugu)

నయనం ఓటీటీ

ఓటీటీలో థ్రిల్లర్లకు మంచి క్రేజ్ ఉంది. ఇక సస్పెన్స్ ను కొనసాగిస్తూ, ఉత్కంఠ రేపే థ్రిల్లర్లకు మరింత ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు నయనం సిరీస్ కు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తోంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. డిసెంబర్ 19న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ సిరీస్. ఇప్పుడు ఆ ఓటీటీలో ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ సిరీస్ గా కొనసాగుతోంది నయనం.

ఆరు ఎపిసోడ్లు

నయనం వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో ఓటీటీలోకి వచ్చింది. ఈ ఎపిసోడ్లు అన్నీ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ప్రతి ఎపిసోడ్ కు ఉత్కంఠ పెంచుతూ, స్టోరీ లైన్ ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ సందేశ్, ఉత్తేజ్, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, అలీ రెజా తదితరులు నటించారు. ఇందులో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

నయనం సిరీస్ స్టోరీ

ఇది ఓ కళ్ల డాక్టర్ కథ. తాను ప్రత్యేకంగా డిజైన్ చేసిన కళ్ల అద్దాలతో అవతలి వాళ్లు ఏం చేస్తున్నారనేది నాలుగు నిమిషాల పాటు చూస్తాడు ఈ డాక్టర్. నయన్ (వరుణ్ సందేశ్) ఓ కళ్ల డాక్టర్. కళ్ల సమస్యలు ఉన్న పేషెంట్లకు తన క్లినిక్ లో చికిత్స అందిస్తుంటాడు. అయితే సీక్రెట్ గా తన దగ్గర ఉన్న ఓ స్పెషల్ కళ్లద్దాల ద్వారా తన దగ్గరకు వచ్చే పేషెంట్ల అద్దాలకు ఉన్న లెన్స్ తో నాలుగు నిమిషాల పాటు చూడగలడు.

ఆ ట్విస్ట్

పేషెంట్లను ట్రీట్ చేసే నయన్ దగ్గరికి మాధవి (ప్రియాంక జైన్) వస్తుంది. మాధవిని ఇష్టపడతాడు నయన్. కానీ ఆమెకు అప్పటికే పెళ్లవుతుంది. ఈ క్రమంలోనే మాధవి భర్త చనిపోతాడు. మరి ఈ హత్య చేసింది ఎవరు అని కనిపెట్టేందుకు పోలీస్ ఆఫీసర్ గా అలీ రెజా రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే నయనం వెబ్ సిరీస్ చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More