20 రోజుల్లోనే ఓటీటీలోకి అర్జున్, ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్.. సీరియల్ కిల్లర్ స్టోరీ.. అదిరిపోయే ట్విస్ట్
సీనియర్ నటుడు అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ థీయావర్ కులై నడుంగ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఓటీటీలోకి మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘థీయావర్ కులై నడుంగ’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఇది సీరియల్ కిల్లర్ చేసే హత్యల చుట్టూ తిరుగుతోంది. మరి ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

థీయావర్ కులై నడుంగ ఓటీటీ
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇందులోనూ తమిళ క్రైమ్ థ్రిల్లర్లకు సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. అలాంటి మరో తమిళ క్రైమ్ థ్రిల్లరే థీయావర్ కులై నడుంగ. ఇది ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. డిసెంబర్ 12 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి ఇది తమిళ భాషలో మాత్రమే డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులో ఉండనుంది.
20 రోజులకే
క్రైమ్ థ్రిల్లర్ థీయావర్ కులై నడుంగ సినిమా థియేటర్లో రిలీజైన దాదాపు 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ నవంబర్ 21, 2025న థియేటర్లలోకి వచ్చింది. 127 నిమిషాల రన్నింగ్ టైమ్ తో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు భరత్ ఆసీవగన్ డైరెక్టర్. ఇందులో అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్, అభిమారి వెంకటాచలం తదితరులు నటించారు.
థీయావర్ కులై నడుంగ స్టోరీ
థీయావర్ కులై నడుంగ సినిమా ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది. ఓ ఫేమస్ రైటర్ జేబనేసన్ అర్ధరాత్రి దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును పోలీస్ ఇన్ స్పెక్టర్ మాగుడపతి (అర్జున్) ఎంక్వైరీ చేస్తాడు. ఆ రైటర్ కు బయటకు మంచి పేరే ఉంటుంది. కానీ తెరవెనుక కనిపించని చీకటి కోణాలు ఉన్నాయని మాగుడపతి తెలుసుకుంటాడు.
మరో హత్య
జేబనేసన్ కు అక్రమ సంబంధాలు, బ్లాక్ మెయిలింగ్ వంటి నేర చరిత్ర ఉంటుంది. ఈ దర్యాప్తు సాగుతున్న సమయంలోనే మరో హత్య జరుగుతుంది. రెండో హత్యలో చనిపోయిన వ్యక్తికి కూడా క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. ఈ రెండు హత్యల్లో ఒకే పాటర్న్ ఉందని మాగుడపతి కనుక్కొంటాడు.
మరోవైపు ఆటిస్టిక్ (మంద బుద్ధి) పిల్లల పాఠశాలలో మీరా (ఐశ్వర్య రాజేష్) టీచర్. ఆమెకు ఆటిజం ఉన్న మేనల్లుడు ఉంటాడు. మరి ఈ హత్యలు ఎవరు చేశారు? దీనికి మీరాకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది ఈ క్రైమ్ థ్రిల్లర్ చూసి తెలుసుకోవాల్సిందే. క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే ఆడియన్స్ కు థీయావర్ కులై నడుంగ సినిమా మంచి ఆప్షన్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


