ప్రపంచవ్యాప్తంగా వివిధ గ్లోబల్ స్టేజీలపై అదరగొట్టిన బాలీవుడ్ మూవీ ‘కెన్నెడీ’. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా ఇతర ఫిల్మ్ ఈవెంట్లలో ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ ఇప్పటికీ థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడేమో డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతుంది ఈ నియో నోయర్ జోనర్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషించింది.
కెన్నెడీ ఓటీటీ

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కెన్నెడీ. ఇందులో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రశంసలు పొందింది. కానీ అప్పటి నుంచి థియేటర్ రిలీజ్ మాత్రం కాలేదు. ఇప్పడు డైరెక్ట్ గా జీ5 ఓటీటీలోకి రాబోతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి సెన్సార్ సర్టిఫికేట్ పొందినా ఈ మూవీ ఎందుకో రిలీజ్ కాలేదు.
అనురాగ్ పోస్ట్
శనివారం (జనవరి 31) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో కెన్నెడీ టీజర్ తో మూవీ ఓటీటీ రిలీజ్ ను డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రకటించాడు. "చివరగా ప్రేమ, కోపం, ప్రతిదీ. ప్రపంచాన్ని చుట్టేసిన తర్వాత కెన్నెడీ ఇంటికి వస్తుంది. జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన నా బృందం, నా నిర్మాతలు, నా స్టూడియోకు నా కృతజ్ఞతలు’’ అని అనురాగ్ రాసుకొచ్చాడు.
ఇంటర్నేషనల్ స్థాయిలో
కెన్నెడీ సినిమా 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. అక్కడ దీన్ని మిడ్నైట్ స్క్రీనింగ్స్ విభాగంలో ప్రదర్శించారు. అప్పుడు ఏడు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది ఈ సినిమా.
{{/usCountry}}కెన్నెడీ సినిమా 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. అక్కడ దీన్ని మిడ్నైట్ స్క్రీనింగ్స్ విభాగంలో ప్రదర్శించారు. అప్పుడు ఏడు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది ఈ సినిమా.
{{/usCountry}}సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్, బుచియాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (దక్షిణ కొరియా), న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (స్విట్జర్లాండ్), ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ తో సహా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో కెన్నెడీని ప్రదర్శించారు.
నియో నోయర్ థ్రిల్లర్
కెన్నెడీ మూవీ ఓ నియో నోయర్ థ్రిల్లర్. అంటే ఇలాంటి సినిమాల్లో లైటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టర్లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. హీరోను మోసం చేసే అందమైన అమ్మాయి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ వెనుక ఓ మిస్టరీ ఉంటుంది.
కెన్నెడీ మూవీ కూడా అలాంటిదే. జీ స్టూడియోస్ సమర్పణలో గుడ్ బాడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మోహిత్ తకాల్కర్, అభిలాష్ తప్లియాల్, మేఘా బర్మన్ తదితరులు కూడా యాక్ట్ చేశారు. కెన్నెడీ మూవీ ఫిబ్రవరిలో జీ5లోకి రానుంది. త్వరలోనే డేట్ అనౌన్స్ చేయనున్నారు.