రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ నరసింహ సీక్వెల్ వచ్చేస్తోంది.. టైటిల్ కూడా చెప్పేసిన సూపర్ స్టార్..

రజనీకాంత్ కెరీర్లోని అతిపెద్ద హిట్స్ లో ఒకటి నరసింహ. 26 ఏళ్ల తర్వాత ఇప్పుడీ సినిమా సీక్వెల్ ప్లాన్స్ ఉన్నట్లు సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించాడు. మూవీ టైటిల్ కూడా రివీల్ చేసిన అతడు.. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నట్లు చెప్పాడు.

Published on: Dec 8, 2025, 21:44:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ నెల 12న తన పుట్టిన రోజు సందర్భంగా బ్లాక్‌బస్టర్ మూవీ నరసింహ రీరిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతున్నట్లు కన్ఫమ్ చేశాడు. అంతేకాదు ఈ సినిమాకు నీలాంబరి అనే టైటిల్ పెట్టినట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు.

రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ నరసింహ సీక్వెల్ వచ్చేస్తోంది.. టైటిల్ కూడా చెప్పేసిన సూపర్ స్టార్..
రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ నరసింహ సీక్వెల్ వచ్చేస్తోంది.. టైటిల్ కూడా చెప్పేసిన సూపర్ స్టార్..

నరసింహ సీక్వెల్ నీలాంబరి

రజనీకాంత్ డిసెంబర్ 12న 75 ఏళ్లు పూర్తి చేసుకొని 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఈ సూపర్ స్టార్ 26 ఏళ్ల కిందట నటించిన నరసింహ మూవీ రీరిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో అతడు నరసింహ (తమిళంలో పడియప్ప) మూవీకి సీక్వెల్ వస్తున్నట్లు కన్ఫమ్ చేశాడు.

“ఆడవాళ్లు కూడా గేట్లు బద్దలు కొట్టుకొని థియేటర్లలోకి దూసుకొచ్చిన సినిమా పడియప్ప. అలాంటి సినిమాకు సీక్వెల్ తీసుకురావాలని అనుకున్నాం. 2.0, జైలర్ 2 చేస్తున్నాం.. పడయప్ప 2 ఎందుకు వద్దు అనుకొని నీలాంబరి టైటిల్ తో తెస్తున్నాం. ఈ సినిమా స్టోరీ చర్చలు నడుస్తున్నాయి” అని రజనీకాంత్ ఆ స్పెషల్ వీడియోలో వెల్లడించాడు.

నరసింహ మూవీ గురించి..

రజనీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో నటించిన నరసింహ మూవీ 1999లో రిలీజైంది. కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా రజనీ కెరీర్లోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందులో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర పేరు మీదే ఇప్పుడీ సీక్వెల్ రానుండటం విశేషం. ఈ పాత్ర ఆమె కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ఓ తల పొగరు ఉన్న అమ్మాయి పాత్రలో తన నటనతో అదరగొట్టింది. రజనీకి పోటీగా ఆమె నటన ఉండగా.. ఓ అమాయక గ్రామీణ అమ్మాయి పాత్రలో సౌందర్య ఒదిగిపోయింది. అలాంటి సినిమాకు 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ తీసుకురానుండటం ఎంతో ఆసక్తి రేపుతోంది. అయితే అంతకుముందు డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కాబోతుండటంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More