...
...
Next Story

Jailer 2 Box Office Collection: దటీజ్ సూపర్ స్టార్.. తొలి వారమే జైలర్ 2 ఆల్ టైమ్ రికార్డు.. నాలుగో స్థానానికి..

Jailer 2 Box Office Collection: రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సంచలన చిత్రం 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను సృష్టిస్తోంది. తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.576.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన 4వ తమిళ చిత్రంగా నిలిచింది.

Published on: Oct 22, 2026, 15:26:50 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jailer 2 Box Office Collection: తమిళ సినీ రంగానికి ఎప్పుడూ చక్రవర్తి అనిపించుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తన బాక్సాఫీస్ స్టామినాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. 2023లో విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'జైలర్ 2' (Jailer 2) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, థియేటర్లలోకి వచ్చిన తొలి రోజు నుంచే అత్యంత సానుకూల టాక్‌తో దూసుకుపోతోంది.

Jailer 2 Box Office Collection: దటీజ్ సూపర్ స్టార్.. వారం కూడా ముగియకముందే జైలర్ 2 అరుదైన రికార్డు.. నాలుగో స్థానానికి..
Jailer 2 Box Office Collection: దటీజ్ సూపర్ స్టార్.. వారం కూడా ముగియకముందే జైలర్ 2 అరుదైన రికార్డు.. నాలుగో స్థానానికి..

నవరాత్రి, దసరా పండుగ సెలవుల కాలాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్న 'జైలర్ 2', థియేటర్లలో ఏడు రోజులు (మొదటి వారం) పూర్తి చేసుకునే సరికే మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లతో ఇండస్ట్రీ రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతోంది. మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్ 1', రజనీకాంత్ గత చిత్రం 'కూలీ', అజయ్ దేవగన్ 'దృశ్యం: ది కన్‌క్లూజన్' లైఫ్‌టైమ్ వసూళ్లను ఈ సినిమా కేవలం వారంలోనే దాటేసింది.

ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ సునామీ: ఎన్ని కోట్లంటే?

ట్రేడ్ వర్గాల అధికారిక సమాచారం ప్రకారం.. 'జైలర్ 2' ఇండియాలో రూ. 317.20 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ఇండియా వైడ్ గ్రాస్ రూ. 371.45 కోట్లకు చేరింది. ఇక ఓవర్సీస్ నుంచి ఏకంగా రూ. 205 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దీనితో కలిపి ప్రపంచవ్యాప్తంగా కేవలం 7 రోజుల్లోనే రూ.576.45 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించింది.

ఈ ఊహించని బాక్సాఫీస్ రన్ ద్వారా 2026 సంవత్సరంలో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా 'జైలర్ 2' నిలిచింది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద రూ. 560 కోట్లు రాబట్టిన అజయ్ దేవగన్ 'దృశ్యం: ది కన్‌క్లూజన్' లైఫ్‌టైమ్ రికార్డును కేవలం వారంలోనే జైలర్ 2 అధిగమించడం విశేషం.

ఎవరెవరి రికార్డులు అవుట్ అంటే..

పొన్నియిన్ సెల్వన్ 1 (PS-1): మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ PS-1 లైఫ్‌టైమ్ గ్రాస్ రూ. 488.36 కోట్లను 'జైలర్ 2' సునాయాసంగా దాటేసింది.

కూలీ (Coolie): రజనీకాంత్ గత చిత్రం, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సాధించిన రూ. 518 కోట్ల వసూళ్లను కూడా ఈ సీక్వెల్ దాటేసింది.

దీనితో కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'జైలర్ 2' అవతరించింది. ప్రస్తుతం రజనీకాంత్ '2.0' (రూ. 691 కోట్లు), దళపతి విజయ్ 'లియో' (రూ. 605.90 కోట్లు), 'జైలర్' (రూ. 604.74 కోట్లు) మాత్రమే దీనికంటే ముందు వరుసలో ఉన్నాయి. వచ్చే రెండవ వారంలో ఇవి కూడా దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

టైగర్ ముత్తువేల్ పాండియన్ నెక్స్ట్ మిషన్ ఏంటి?

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్ రిటైర్డ్ జైలర్ 'టైగర్ ముత్తువేల్ పాండియన్' పాత్రలో తిరిగి అలరించారు. రమ్యకృష్ణ, మిర్నా, రిత్విక్ పాత పాత్రల్లో కనిపించగా.. ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, విద్యా బాలన్ వంటి దిగ్గజ నటులు కొత్తగా వచ్చి చేరారు.

మొదటి భాగం ముగిసిన దగ్గరి నుంచే ప్రారంభమయ్యే ఈ కథలో.. విగ్రహాల అక్రమ రవాణా చేసే అంతర్జాతీయ ముఠా నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం, మరియు కొడుకు మరణం గురించిన నిజాన్ని దాచడంలో ఎదురయ్యే సవాళ్లను రజనీకాంత్ తనదైన స్టైల్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో మెప్పించారు. వీకెండ్స్ దాటినా కూడా వీక్‌డేస్‌లో థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం రజనీకాంత్ మానియాకు నిదర్శనంగా నిలుస్తోంది.

టాప్ మూవీస్ 2026వసూళ్లు
ధురంధర్: ది రివేంజ్ ₹1813 crore
జైలర్ 2 ₹576 crore
దృశ్యం: ది కన్‌క్లూజన్ ₹560 crore
హనుమాన్ అంశ్ ₹451 crore
బోర్డర్ 2 ₹450 crore
View All
అత్యధిక వసూళ్ల తమిళ సినిమాలువసూళ్లు
2.0 ₹691 crore
లియో ₹605 crore
జైలర్ ₹604 crore
జైలర్ 2 ₹576 crore
కూలీ ₹518 crore
View All
 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks