...
...
Next Story

Surekha Vani: గ్లామర్ డోస్ పెంచేసిన సురేఖ వాణి.. కూతురు సుప్రీతతో అందాల పోటీ.. వైరల్ వీడియో!

Surekha Vani: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది. 45 ఏళ్ల వయసులోనూ ఆమె గ్లామర్ షోతో సాగిపోవడమే ఇందుకు కారణం. తన కూతురు సుప్రీతతో సురేఖ వాణి అందంలో పోటీ పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా సురేఖ వాణి పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published on: Oct 11, 2026, 18:20:14 IST
Advertisement

Surekha Vani: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తన అద్భుతమైన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో మళ్లీ అలజడి సృష్టిస్తున్నారు. 45 ఏళ్ల వయసులోనూ ఆమె గ్లామర్ షో చేస్తూ సరికొత్త ట్రెండ్‌ సెట్ చేస్తున్నారు.

సురేఖా వాణి వీడియో

అందంలో కూతురితో పోటీపడుతున్న సురేఖా వాణి.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ షో.. ఫొటోలు, వీడియోలు వైరల్! (instagram-Surekhavani)
అందంలో కూతురితో పోటీపడుతున్న సురేఖా వాణి.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ షో.. ఫొటోలు, వీడియోలు వైరల్! (instagram-Surekhavani)

ఇవాళ (అక్టోబర్ 11) తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో సురేఖ వాణి షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో ఆమె గ్లామర్ షో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని ఆమె తన ఫిట్‌నెస్‌తో మరోసారి నిరూపించారు.

కూతురితో కలిసి

ఈ మధ్య కాలంలో సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి రిల్స్, డాన్స్ వీడియోలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా సురేఖ వాణి తన కూతురిలో అందంలో పోటీపడుతున్నట్లు కనిపించింది. నెటిజన్లు కూడా ఇవే కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు వీరిద్దరినీ తల్లి, కూతుళ్లు అనడం కంటే.. అక్కాచెల్లెళ్లు అనడం కరెక్ట్ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

రియల్ లైఫ్ లో ఇలా

భర్త మరణం తర్వాత లైఫ్‌లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న సురేఖ వాణి.. వాటన్నింటినీ దాటుకుని ఇప్పుడు లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. కూతురే సర్వస్వంగా భావిస్తూ.. ఆమెతో కలిసి ట్రిప్స్ వేస్తూ, పార్టీలలో పాల్గొంటూ బిందాస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందుకే నెట్టింట ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది.

సురేఖా వాణి షేర్ చేసే ప్రతీ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడానికి కారణం ఆమె పాజిటివ్ ఆటిట్యూడ్. ఈ లేటెస్ట్ వైరల్ వీడియో కూడా ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నెటిజన్లు లైకులు, షేర్లతో ఈ వీడియోను మరింతగా ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఆమె కూతురు సుప్రీత కూడా సినిమాల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks