Scene OTT Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 'ఆవేశం', 'రోమాంచం' చిత్రాల ఫేమ్ మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 6న థియేటర్లలో విడుదలై సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. సాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, తొలి పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 242.05 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఊహించినదాని కంటే ముందే ఓటీటీలోకి రానుంది.
నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి..

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'సీన్' చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 85 కోట్లకు పైగా (కొన్ని రిపోర్టుల ప్రకారం రూ. 88 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ స్ట్రీమింగ్‌కు మధ్య నాలుగు వారాల గ్యాప్ ఉండేలా నిబంధన పెట్టుకున్నారు. నవంబర్ 6న థియేటర్లలో విడుదలైనందున, థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే డిసెంబర్ 4న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టనుంది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కోలీవుడ్‌లో భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలు సైతం 4 వారాల విండోను పాటించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే తమిళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' (Jailer 2) చిత్రం కూడా థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు వారాలకు, నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పుడు సూర్య 'సీన్' కూడా అదే బాటలో పయనిస్తోంది.
బాక్సాఫీస్ జోరు vs ఓటీటీ ఎంట్రీ
సాక్నిల్క్ బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం.. 'సీన్' మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 242.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ. 247.85 కోట్లకు చేరింది. తొలి 10 రోజుల్లో భారత్‌లో రూ. 158.55 కోట్ల గ్రాస్ రాబట్టగా, విదేశాల్లో ఏకంగా రూ. 83.50 కోట్లు వసూలు చేసి సూర్య కెరీర్‌లోనే ఆల్-టైమ్ ఓవర్సీస్ రికార్డును నెలకొల్పింది.
{{/usCountry}}సాక్నిల్క్ బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం.. 'సీన్' మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 242.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ. 247.85 కోట్లకు చేరింది. తొలి 10 రోజుల్లో భారత్‌లో రూ. 158.55 కోట్ల గ్రాస్ రాబట్టగా, విదేశాల్లో ఏకంగా రూ. 83.50 కోట్లు వసూలు చేసి సూర్య కెరీర్‌లోనే ఆల్-టైమ్ ఓవర్సీస్ రికార్డును నెలకొల్పింది.
{{/usCountry}}రెండో వీకెండ్‌లోనూ శనివారం వసూళ్లు భారీగా పుంజుకోవడంతో రూ. 24.80 కోట్ల ఇండియా నెట్ వసూళ్లను జతచేసింది. రెండో వీకెండ్ ముగిసిన కేవలం 19 రోజులకే అంటే డిసెంబర్ 4న ఓటీటీలోకి రావడం వల్ల, థియేట్రికల్ రన్‌కు తక్కువ సమయం మిగులుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల ఆదరణను బట్టి థియేటర్లలో ప్రదర్శన కొనసాగే అవకాశం ఉంది.
‘సీన్’ స్టోరీ ఏంటంటే?
మలయాళంలో 'రోమాంచం', 'ఆవేశం' వంటి కల్ట్ చిత్రాలను అందించిన జిత్తు మాధవన్, తన తొలి తమిళ చిత్రమైన 'సీన్'ను ఒక వైవిధ్యమైన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు.
దీపావళి పండుగ నేపథ్యంలో సాగే ఈ కథలో, లోపాలున్న ఒక పోలీస్ ఆఫీసర్ (డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో సూర్య), విచిత్రమైన మనస్తత్వం కలిగిన ఒక కాంట్రాక్ట్ కిల్లర్ మధ్య జరిగే దొంగాపోలీస్ ఆట ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది.
సూర్య సరసన నజ్రియా నజీమ్, యువ సంచలనం నస్లెన్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు జై, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో మెరిశారు. సుశిన్ శ్యామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
థియేటర్లలో ప్రతి పది నిమిషాలకు విజిల్స్ వేయిస్తున్న సూర్య 'సీన్', త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.