...
...
Next Story

Suriya Karuppu: బ్లాక్‌బస్టర్ ఇస్తానని మాట ఇచ్చావ్.. కరుప్పు సక్సెస్ జోష్ లో సూర్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Suriya Karuppu: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు' థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ అద్భుతమైన విజయంపై స్పందించిన సూర్య.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. ఇప్పుడి ఇది వైరల్ గా మారింది.

Published on: May 17, 2026, 06:07:39 IST
Advertisement

Suriya Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ ప్రాజెక్ట్ 'కరుప్పు' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల నుంచి ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు అందిస్తున్న ఈ అపూర్వమైన ప్రేమ, ఘన విజయంపై హీరో సూర్య ఎమోషనల్ అయ్యాడు. సినిమాను ఇంతటి బ్లాక్‌బస్టర్‌గా మార్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూనే, ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన తన చిత్ర బృందాన్ని ఆయన పేరుపేరునా అభినందించాడు.

సూర్య ఎమోషనల్ పోస్ట్

కరుప్పు పోస్టర్ లో సూర్య (x/Suriya_offl)
కరుప్పు పోస్టర్ లో సూర్య (x/Suriya_offl)

"ప్రపంచవ్యాప్తంగా మాకు లభిస్తున్న ఈ ప్రేమ, పేరు ప్రఖ్యాతులు కేవలం 'కరుప్పు' చిత్ర యూనిట్ కష్టానికి దక్కిన ప్రతిఫలం. కథను నమ్మి ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారు. ఈ సినిమాకు అండగా నిలిచిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ప్రభు ఎస్.ఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు" అని సూర్య తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశాడు.

చిన్నారి పుట్టిన ఆనందంలో

సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించిన కలైవానన్‌ను సూర్య ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. "ఎడిటింగ్ లాక్ అయ్యే వరకు వేరే దేనిపైనా దృష్టి పెట్టకుండా కేవలం మా సినిమా కోసమే కలైవానన్ పనిచేశాడు. ఇంట్లో చిన్నారి పుట్టిన ఆనందంలో ఉంటూనే, సినిమా బాధ్యతలను ఆయన బ్యాలెన్స్ చేసిన విధానం నిజంగా అభినందనీయం" అని సూర్య కొనియాడాడు.

ఈ వైబ్

ఇక సినిమాను విజువల్ వండర్‌గా మార్చిన సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణు గురించి సూర్య మాట్లాడుతూ.. "విష్ణు బావా! షూటింగ్ సమయంలో నాపై నువ్వు చూపించిన ప్రేమకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. నువ్వు, నీ టీమ్ పగలు రాత్రి అనకుండా కష్టపడి బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. నీ ప్రేమ, శ్రమ 'కరుప్పు' సినిమాపై ఒక మ్యాజిక్ లాగా పనిచేసింది" అని ఎమోషనల్ అయ్యాడు.

బ్లాక్ బస్టర్ ఇస్తానని

చివరగా డైరెక్టర్ ఆర్జే బాలాజీపై సూర్య ప్రశంసలు కురిపించాడు. "నువ్వు నాకు ఒక భారీ బ్లాక్‌బస్టర్ ఇస్తానని మాట ఇచ్చావు. అన్నట్టుగానే థియేటర్లలో మ్యాజిక్ రిపీట్ చేశావు. సినిమాను హిట్ చేయడమే కాకుండా అందరి మనసులను గెలుచుకున్నావు. నీ సంకల్ప బలానికి నా రెస్పెక్ట్. నువ్వు భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి" అంటూ సూర్య ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం సూర్య చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్య, త్రిష జంటగా నటించిన కరప్పు మూవీ తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1.కరుప్పు సినిమా హీరో ఎవరు?

ఈ చిత్రంలో వైవిధ్యభరితమైన పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించాడు.

2.కరుప్పు సినిమాను నిర్మించింది ఎవరు?

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ప్రభు ఎస్.ఆర్. సంయుక్తంగా నిర్మించారు.

3.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?

ప్రస్తుతం చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ట్రెండింగ్‌లో ఉన్న సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks