RJ Balaji: ఎన్నో అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆఖరి నిమిషంలో విడుదల వాయిదా.. వీటన్నింటినీ తట్టుకుని సూర్య నటించిన 'కరుప్పు' (Karuppu) శుక్రవారం (మే 15) థియేటర్లలోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్లో ఎమోషనల్ అయ్యారు. ఆయన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'జెర్సీ' సీన్‌ను గుర్తు చేసిన బాలాజీ

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమాలో నాని తన విజయాన్ని రైల్వే స్టేషన్లో అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. సరిగ్గా అదే తరహాలో 'కరుప్పు' సినిమాకు థియేటర్లో వస్తున్న స్పందన చూసి బాలాజీ ఆనందంతో అరిచారు. గాల్లోకి పిడికిలి బిగించి, భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న హీరోయిన్ త్రిష, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, సూర్య తమ్ముడు కార్తీ.. బాలాజీని చూసి ముసిముసి నవ్వులు చిందించారు. సినిమా ముగిశాక ఫ్యాన్స్ అందరూ బాలాజీ పేరును గట్టిగా పలకడంతో ఆయన వెక్కివెక్కి ఏడ్చేశారు. వెంటనే త్రిష ఆయనను హగ్ చేసుకుని ఓదార్చారు. "ఇది కదా అసలైన విజయం అంటే" అంటూ అభిమానులు ఈ వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.
వివాదాల మధ్య విడుదల
నిజానికి ఈ సినిమా గురువారమే (మే 14) విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాత ఎస్ఆర్ ప్రభుకు ఎదురైన ఆర్థిక సమస్యల వల్ల థియేటర్లకు వెళ్లాల్సిన కేడీఎం (KDM) ఫైల్స్ ఆగిపోయాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ సినిమా కోసం ఉదయం 9 గంటల షోలకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ, మొదటి రోజు ప్రదర్శనలు రద్దయ్యాయి. ఒకవైపు సౌత్ ఇండియాలో షోలు క్యాన్సిల్ అయితే, మరోవైపు 'క్యూబ్' సంస్థ పొరపాటున ముంబై, పూణే ప్రాంతాల్లో సినిమాను ప్లే చేసింది. దీనివల్ల పైరసీ భయం పట్టుకుంది.
{{/usCountry}}తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ సినిమా కోసం ఉదయం 9 గంటల షోలకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ, మొదటి రోజు ప్రదర్శనలు రద్దయ్యాయి. ఒకవైపు సౌత్ ఇండియాలో షోలు క్యాన్సిల్ అయితే, మరోవైపు 'క్యూబ్' సంస్థ పొరపాటున ముంబై, పూణే ప్రాంతాల్లో సినిమాను ప్లే చేసింది. దీనివల్ల పైరసీ భయం పట్టుకుంది.
{{/usCountry}}రూ.140 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా మొదటి రోజే రూ.25 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక రోజు ఆలస్యమైనా, టాక్ పాజిటివ్‌గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద 'కరుప్పు' గర్జన గట్టిగానే వినిపిస్తోంది.
కరుప్పు మూవీ విశేషాలు
ఆర్జే బాాలాజీ డైరెక్ట్ చేసిన కరుప్పు మూవీలో సూర్య, త్రిష కృష్ణన్, కార్తీ (అతిథి పాత్ర)లాంటి వాళ్లు నటించారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించాడు. యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అభిమానులు సోషల్ మీడియాలో చాలా వరకు పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'కరుప్పు' సినిమా ఒక రోజు ఆలస్యంగా ఎందుకు విడుదలైంది?
నిర్మాణ సంస్థ 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' ఎదుర్కొన్న ఆర్థిక లావాదేవీల చిక్కుల వల్ల మే 14న విడుదల కావాల్సిన సినిమా మే 15కి వాయిదా పడింది.
2. కరుప్పు సినిమాలో సూర్య నటనకు ఎలాంటి స్పందన వస్తోంది?
సూర్య ఈ సినిమాలో లాయర్‌గా, మాస్ యాక్షన్ రోల్‌లో అదరగొట్టారని, ఆయన కెరీర్‌లో ఇది పక్కా కమర్షియల్ హిట్ అని రివ్యూలు వస్తున్నాయి.
3. ఆర్జే బాలాజీ ఎందుకు ఏడ్చారు?
సినిమా విడుదల కోసం గత కొన్ని రోజులుగా ఆయన పడ్డ కష్టం, టెన్షన్.. చివరకు సినిమా హిట్ అని తెలియగానే ఆనందభాష్పాలుగా మారాయి.