OTT Trending: సూర్య హీరోగా తెరకెక్కిన క్లాస్ అండ్ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' డిజిటల్ స్పేస్‌లో అద్భుతమైన ఆరంభాన్ని దక్కించుకుంది. ఓటీటీని షేక్ చేస్తోంది. థియేటర్లలో రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ అదరగొట్టింది. ఫ్యామిలీస్ కు పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ గా మారింది.
విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రెండింగ్

నెట్‌ఫ్లిక్స్ లో గ్రాండ్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు జనాల నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన 24 గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 మూవీస్ చార్ట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది ఈ మూవీ. ఇప్పుడు ఇండియా వైడ్ గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నంబర్ వన్ గా కొనసాగుతోంది విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా.
సూర్య, మమితా జోడీ
'కరుప్పు' వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత సూర్య నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీ సబ్జెక్ట్‌కు డిజిటల్ వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఓటీటీలో ట్రెండింగ్ ఎందుకు?
తమిళ థియేట్రికల్ మార్కెట్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఓటీటీ వేదికపై మాత్రం వ్యూయర్ షిప్ సునామీ కనిపిస్తోంది. తమిళనాడు థియేటర్లలో మాస్. యాక్షన్ సినిమాలకు లభించే ఆదరణతో పోలిస్తే.. వెంకీ అట్లూరి మార్క్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్లకు తెలుగు, హిందీ డిజిటల్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు.
గతంలో 'సార్ (వాతి)', 'లక్కీ భాస్కర్' చిత్రాలలో వెంకీ అట్లూరి చూపించిన హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ డిజిటల్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలోని ఎమోషనల్ బంధం, సరోగసీ డ్రామా థియేటర్ల కంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వీకెండ్ సమయంలొ కుటుంబ సమేతంగా చూసేందుకు పర్ఫెక్ట్ కంటెంట్‌గా మారింది.
స్టార్ కాస్ట్
{{/usCountry}}గతంలో 'సార్ (వాతి)', 'లక్కీ భాస్కర్' చిత్రాలలో వెంకీ అట్లూరి చూపించిన హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ డిజిటల్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలోని ఎమోషనల్ బంధం, సరోగసీ డ్రామా థియేటర్ల కంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వీకెండ్ సమయంలొ కుటుంబ సమేతంగా చూసేందుకు పర్ఫెక్ట్ కంటెంట్‌గా మారింది.
స్టార్ కాస్ట్
{{/usCountry}}ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య చూపించిన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, మమితా బైజు చలాకీతనం కథను ముందుకు నడిపించాయి. వీరికి తోడుగా సీనియర్ నటీనటులు రాధికా శరత్‌కుమార్, నాజర్, రవీనా టాండన్, సునీల్ రెడ్డి, భవానీ శ్రీ వంటి ప్రముఖులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం కథలోని ఎమోషనల్ సీన్లను మరింతగా పండించింది. విభిన్న భాషల ప్రేక్షకులు ఈ సినిమాను రీజనల్ లాంగ్వేజెస్ డబ్బింగ్‌లో చూస్తుండటంతో రాబోయే వారాల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ నేషనల్ అండ్ గ్లోబల్ చార్ట్స్‌లో ఈ సినిమా తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.