...
...
Next Story

Sushant Singh Rajput: ఆరు ఏళ్లుగా మారని ‘సుశాంత్’ జ్ఞాపకం.. సోదరి శ్వేతా సింగ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. నెపోటిజంపై రచ్చ

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి, అభిమానుల మనసుల్లో అమరుడిగా నిలిచిన హీరో. ఇవాళ సుశాంత్ ఆరో వర్థంతి. ఈ సందర్భంగా అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె బాధ అందరినీ కలిచివేస్తోంది.

Published on: Jun 14, 2026, 15:35:45 IST
Advertisement

Sushant Singh Rajput: బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఈ లోకాన్ని వీడి ఆరు సంవత్సరాలు అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సుశాంత్ సింగ్ వర్థంతి

ఆరు ఏళ్లుగా మారని ‘సుశాంత్’ జ్ఞాపకం.. చెల్లెలు శ్వేతా సింగ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ (instagram)
ఆరు ఏళ్లుగా మారని ‘సుశాంత్’ జ్ఞాపకం.. చెల్లెలు శ్వేతా సింగ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ (instagram)

సుశాంత్ సింగ్ ఆరేళ్ల క్రితం 2020, జూన్ 14న కన్నుమూశారు. ఆయన మరణం అప్పట్లో కలకలం రేగింది. మొత్తం సినీ ఇండస్ట్రీనే కదిలించింది. సుశాంత్ ఆరో వర్థంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం కొన్ని ఏఐ (AI) ఫోటోలు, పాత మధుర స్మృతులను పంచుకుంటూ శ్వేతా సింగ్ రాసిన వ్యాఖ్యలు అభిమానుల కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి నెపోటిజం రచ్చ మొదలైంది.

ఆదర్శాలు చావవు

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్వేతా సింగ్ పెట్టిన పోస్ట్ కేవలం ఒక సోదరి ఆవేదన మాత్రమే కాదు, సుశాంత్ అనే బ్రాండ్ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఒక నిదర్శనం.

"ఆరేళ్లు గడిచిపోయాయి.. అయినా కొన్ని ఆత్మలు కాలాతీతంగా ఎదుగుతూనే ఉంటాయి. నా సోదరుడు ఎలా వెళ్లాడు అనే దాని గురించి నేను ఆలోచించను, కానీ అతను ఎలా జీవించాడో గుర్తుంచుకుంటా. నక్షత్రాలు, విశ్వం, క్వాంటం ఫిజిక్స్, మానవ మనస్సుపై అతనికున్న అపరిమితమైన మోహం గురించే ఆలోచిస్తా" అని శ్వేత పేర్కొనడం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

సుశాంత్ మరణం

సుశాంత్ ఆత్మహత్య వెనుక మిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పుడు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై ఆయన కుటుంబం ఫిర్యాదు చేసింది. కానీ ఎలాంటి ఆధారాలు లేవని కేసు నీరుగారిపోయింది.

మారిన బాలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిష్క్రమణ తర్వాత బాలీవుడ్ లో ఒక పెద్ద మార్పు వచ్చింది. అంతకుముందు స్టార్ కిడ్స్ సినిమాలకు బ్లైండ్‌గా ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి ఉండేది. కానీ గత ఆరేళ్ల ట్రేడ్ అనాలిసిస్ అలా లేదు.

సుశాంత్ మరణం తర్వాతే నెటిజన్లు ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ ట్రెండ్‌ను గట్టిగా నడిపారు. కంటెంట్ సరిగ్గా లేకపోతే నెపో-కిడ్స్ సినిమాలను థియేటర్లలో నిర్మొహమాటంగా తిరస్కరించడం ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు.

People Also Ask (PAA) - తరచుగా అడిగే ప్రశ్నలు

  1. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎప్పుడు మరణించారు?

జవాబు: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020 న ముంబైలోని తన నివాసంలో మరణించారు. నేటికి ఆయన మరణించి సరిగ్గా ఆరు సంవత్సరాలు పూర్తయింది.

2. సుశాంత్ సింగ్ సోదరి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు ఏంటీ?

జవాబు: సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. సుశాంత్ కొన్ని ఏఐ (AI) క్రియేటెడ్ చిత్రాలను షేర్ చేస్తూ, ఆయన చావు గురించి కాకుండా, ఆయన ఎంత గొప్పగా జీవించాడో గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ నివాళి అర్పించారు.

3. చిచోరే సినిమా హిట్ ఆ ఫ్లాప్?

జవాబు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చిచోరే’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks