మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి (ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడి) ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు.

ఈ నియామకంతో సుస్మిత కొణిదెల ఇంద్రకీలాద్రి ఆలయానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా వ్యవహారాల్లో భాగస్వామ్యం కానున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి నిత్యం వేలాది మంది, దసరా నవరాత్రుల సమయంలో లక్షలాది మంది భక్తులు దేశ నలుమూలల నుండి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పించే మౌలిక వసతులు, దర్శన విధానాలు, సేవలు, ప్రాంగణ పరిశుభ్రత తదితర విషయాల్లో సుస్మిత తన వంతు సూచనలు, పూర్తి సహకారం అందించనున్నారు.
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన సుస్మిత కొణిదెల, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, అనంతరం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మించారు. సామాజిక దృక్పథం, సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఉన్న ఆమెను దేవాదాయ శాఖ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా చేర్చడం పట్ల అభిమానులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. క్యూలైన్లు, వికలాంగులు, వృద్ధుల సౌకర్యాలు, మంచినీటి, విశ్రాంతి గదుల సదుపాయాలు మెరుగుపరచడంపై దేవస్థానం ఫోకస్ చేస్తోంది.
అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదాల నాణ్యత, దర్శన వేళల సమర్థవంతమైన నిర్వహణపై దుర్గమ్మ ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో భద్రత, పారిశుధ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేవల వేగవంతం చేశారు.
{{/usCountry}}అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదాల నాణ్యత, దర్శన వేళల సమర్థవంతమైన నిర్వహణపై దుర్గమ్మ ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో భద్రత, పారిశుధ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేవల వేగవంతం చేశారు.
{{/usCountry}}ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ దుర్గమ్మ ఆలయ విశిష్టతను కాపాడుతూ, భక్తుల సౌకర్యార్థం నూతన దృక్పథంతో పనిచేసేందుకు దేవస్థానం కృషి చేస్తోంది. మరోవైపు దేవాదాయ శాఖ నిర్ణయంపై మెగా అభిమానులు, సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సుస్మిత కొణిదెలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.