కార్తీకేయ 2తో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టేందుకు ‘స్వయంభు’తో రాబోతున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ను ఇవాళ (ఫిబ్రవరి 11) రిలీజ్ చేశారు మేకర్స్. అదిరే యాక్షన్, అద్భుతమైన విజువల్స్ తో టీజర్ అదిరిపోయింది.
స్వయంభు టీజర్

హీరో నిఖిల్ రెండేళ్లుగా స్వయంభు సినిమా కోసం కష్టపడుతున్నాడు. యోధుడి క్యారెక్టర్ కు తగ్గట్లు తన ఫిజిక్ ను మార్చుకున్నాడు. కత్తి పట్టి పోరాటాలు చేస్తున్నాడు. స్వయంభు మూవీ కోసం తీవ్రంగా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఆ కష్టం స్వయంభు మూవీ టీజర్ లో కనిపించింది. బుధవారం రిలీజైన ఈ టీజర్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. విజువల్స్ బాహుబలి రేంజ్ లో ఉన్నాయంటున్నారు.
పీరియాడిక్ వార్ డ్రామా
స్వయంభు మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి డైరెక్టర్. ఈ సినిమాలో నిఖిల్ తో పాటు సంయుక్త మీనన్, నభా నటేష్, సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు నటిస్తున్నారు. పిక్సల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ స్వయంభు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు ప్రసాద్ ఐమ్యాక్స్ లో జరిగిన ఈవెంట్లో స్వయంభు టీజర్ రిలీజ్ చేశారు.
యోధుడిగా నిఖిల్
స్వయంభు సినిమాలో ప్రజల కోసం రాజులతో పోరాడే యోధుడిగా నిఖిల్ కనిపించనున్నాడు. టీజర్ లో అతని డైలాగ్స్, యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ‘సాక్షాత్తూ ఆ సదాశివుడే దిగివిచ్చి శ్రీ రాముడికి అందించిన ఈ సింగూరికి కూడా అరణ్యవాసమా’ అనే డైలాగ్ తో మిస్టీరియస్ గా టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాజ్యం కోసం అమాయక ప్రజల ప్రాణాలను తీసే సీన్లతో టీజర్ సాగుతుంది.
హీరో ఎంట్రీ
కాలం కత్తై దూస్తే.. కాపాడే కవచం ఒకటి కావాలి కదా అనే డైలాగ్ తర్వాత యోధుడిగా నిఖిల్ ఎంట్రీ అదిరిపోయింది. తెగింపు ఎంత దూరమైనా వెళ్తుందంటూ వచ్చే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. సంయుక్త మీనన్ కూడా ఫైటింగ్ సీక్వెన్స్ లో కనిపించింది. రాజకుమారిగా నభా నటేష్ అందంగా అలరించింది.
చైనీస్, స్పానిష్ లోనూ
{{/usCountry}}కాలం కత్తై దూస్తే.. కాపాడే కవచం ఒకటి కావాలి కదా అనే డైలాగ్ తర్వాత యోధుడిగా నిఖిల్ ఎంట్రీ అదిరిపోయింది. తెగింపు ఎంత దూరమైనా వెళ్తుందంటూ వచ్చే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. సంయుక్త మీనన్ కూడా ఫైటింగ్ సీక్వెన్స్ లో కనిపించింది. రాజకుమారిగా నభా నటేష్ అందంగా అలరించింది.
చైనీస్, స్పానిష్ లోనూ
{{/usCountry}}స్వయంభు మూవీ అనౌన్స్ మెంట్ అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు టీజర్ తో హైప్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. 2026 సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది.