OTT Tamil: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హీరో తమిళ రొమాంటిక్ మూవీ- గర్ల్‌ఫ్రెండ్ అక్క, తల్లితో ఎఫైర్- ట్విస్టులు, 6.8 రేటింగ్
Sweety Naughty Crazy OTT Streaming: తెలుగు యంగ్ హీరో త్రిగుణ్ నటించిన తమిళ అడల్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ స్వీటీ నాటీ క్రేజీ ఓటీటీకి వచ్చేసింది. బోల్డ్ కాన్సెప్ట్, ఊహించని ట్విస్టులు, హాస్య సన్నివేశాలతో తెరకెక్కిన ఈ స్వీటీ నాటీ క్రేజీ 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగులో కథానాయుకుడిగా తన మార్క్ చూపించేందుకు తెగ ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో త్రిగుణ్. ప్రేమదేశం, కొండ, కథ కించికి మనం ఇంటికి వంటి సినిమాలతో అలరించిన త్రిగుణ్ ఇటీవలే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీతో ఆకట్టుకున్నాడు.

ఇటీవలే ఓటీటీలోకి
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. సన్ నెక్ట్స్‌లో ఆగస్ట్ 14 నుంచి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ తెలుగు హీరో త్రిగుణ్ నటించిన తమిళ సినిమా కూడా ఓటీటీలో సందడి చేస్తోంది.
ఆ సినిమానే 'స్వీటీ నాటీ క్రేజీ' (Sweety Naughty Crazy). ఇది ఒక తమిళ అడల్ట్ రొమాంటిక్ కామెడీ సినిమా. ఇందులో త్రిగుణ్ శివ అనే పాత్రలో నటించాడు. రాజశేఖర్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. ఐఎమ్‌డీబీలో స్వీటీ నాటీ క్రేజీ సినిమా పదికి 6.8 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాంక్ అయ్యే కథ!
కోయంబత్తూరులోని ఒక కాలేజీలో చదువుకునే శివ (త్రిగుణ్), అనిత (శ్రీజిత ఘోష్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. జాలిగా తిరిగే నైజం ఉన్న శివ, అనుకోకుండా తన ట్యూషన్ టీచర్ (ఇనియా)తో పాటు మరొక సీనియర్ మహిళతో కూడా అఫైర్స్ నడుపుతాడు. ఏది ఆలోచించకుండానే ఆ రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్తాడు.
తీరా ప్రేయసి అనితను పెళ్లి చేసుకుని, ఆమె కుటుంబ సభ్యులను కలవడానికి ఒక హిల్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు శివకు అసలైన షాక్ తగులుతుంది. తాను గతంలో అక్రమ సంబంధం నడిపిన ఆ ఇద్దరు మహిళలు మరెవరో కాదు.. అనితకు సొంత అక్క, తల్లి అని తెలుస్తుంది.
డబుల్ మీనింగ్ కామెడీ
రొటీన్ కథలకు భిన్నంగా అడల్ట్ కామెడీ, ట్విస్టులతో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజశేఖర్ జి పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. కాలేజ్ ఫ్రెండ్స్ మధ్య వచ్చే డబుల్ మీనింగ్ సంభాషణలు, హాస్య సన్నివేశాలు యూత్‌ను నవ్వించేలా ఉన్నాయి. శృంగారభరిత సన్నివేశాలను కాస్త సరదాగా, బోల్డ్‌గా చూపే ప్రయత్నం చేశారు.
"కాస్త సిగ్గుపడుతూనే బిగ్గరగా నవ్వుకునేలా చేసే అడల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది" అని సినిమాకు రివ్యూలు వచ్చాయి. హీరోయిన్‌గా శ్రీజిత ఘోష్ ఆకట్టుకోగా, ఇతర కీలక పాత్రల్లో ఇనియా, రవి మరియా, తంబి రామయ్య తమ వంతు నటనతో మెప్పించారు.
గిల్టీ ప్లెజర్ మూవీ
నటుడిగా త్రిగుణ్ తనదైన టైమింగ్‌తో ఆకట్టుకోగా, కథలోని అపార్థాలు, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయి. పరిమితులకు లోబడి సాగే అడల్ట్ కామెడీ చిత్రాలను ఇష్టపడేవారికి 'స్వీటీ నాటీ క్రేజీ' ఒక మంచి టైమ్‌పాస్ ఆప్షన్. వారాంతంలో సరదాగా నవ్వుకోవాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికలపై వీక్షించవచ్చు.
తాజాగా ఇటీవలే 'అహా' (Aha) ప్లాట్‌ఫామ్‌లో స్వీటీ నాటీ క్రేజీ ఓటీటీ రిలీజ్ అయింది. ఆగస్టు 21 నుంచి ఆహాలో స్వీటీ నాటీ క్రేజీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఆహా కంటే ముందే టెంట్ కొట్టా అనే మరో ఓటీటీలో కూడా స్వీటీ నాటీ క్రేజీ అందుబాటులో ఉంది.
స్వీటీ నాటీ క్రేజీ ఓటీటీ స్ట్రీమింగ్
మార్చి 27 నుంచే ఈ టెంట్‌కొట్టాలో స్వీటీ నాటీ క్రేజీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, ప్రస్తుతం రెండు ఓటీటీల్లో త్రిగుణ్ స్వీటీ నాటీ క్రేజీ అందుబాటులో ఉంది. విభిన్నమైన లైన్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


