...
...
Next Story

Taapsee Pannu:ప్రేక్షకులపై నిందలు వేసి తప్పించుకుంటున్నారు-పెద్ది, టాక్సిక్ హీరోయిన్ల వివాదంపై తాప్సీ షాకింగ్ కామెంట్లు

Taapsee Pannu: రామ్ చరణ్ 'పెద్ది', యష్ 'టాక్సిక్' సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై నటి తాప్సీ పన్ను రియాక్టయింది. సినిమాల్లో గ్లామర్, ఆబ్జెక్టిఫికేషన్‌కు ప్రేక్షకులనే నిందించే ధోరణిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడింది.

Published on: Sep 4, 2026, 14:08:26 IST
Advertisement

Taapsee Pannu: ఇటీవల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రామ్ చరణ్ 'పెద్ది', కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' చిత్రాల్లో హీరోయిన్లను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. సినిమాల్లో స్త్రీలను కేవలం గ్లామర్ బొమ్మలుగా, ఆబ్జెక్టిఫై చేస్తూ చూపించడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై తాప్సీ పన్ను రియాక్టయింది.

తాప్సీ కామెంట్లు

ప్రేక్షకులపై నిందలు వేసి తప్పించుకుంటున్నారు-పెద్ది,  టాక్సిక్ హీరోయిన్ల వివాదంపై తాప్సీ షాకింగ్ కామెంట్లు (instagram-Taapsee Pannu)
ప్రేక్షకులపై నిందలు వేసి తప్పించుకుంటున్నారు-పెద్ది, టాక్సిక్ హీరోయిన్ల వివాదంపై తాప్సీ షాకింగ్ కామెంట్లు (instagram-Taapsee Pannu)

తాప్సీ లీడ్ రోల్ ప్లే చేసిన గాంధారి మూవీ డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ సంచలన కామెంట్లు చేసింది. సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానంపై అడిగిన ప్రశ్నకు తాప్సీ స్పందిస్తూ.. "సోషల్ మీడియాలో కనిపించే డిజిటల్ ప్రపంచం వేరు, గ్రౌండ్ లెవల్ లో ఉండే నిజ ప్రపంచం వేరు. ముఖ్యంగా మాస్ సినిమాలపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది’’ అని తాప్సీ చెప్పింది.

అవే ఫొటోలను

‘‘మీరు నెట్‌లో ఎంత రచ్చ చేసినా కూడా.. అదే ఫొటోలను జూమ్ చేస్తూ, విచిత్రమైన యాంగిల్స్‌తో వీడియోలు చేసి వైరల్ చేసే వర్గం కూడా సోషల్ మీడియాలోనే ఉంది. అంటే అలాంటి కంటెంట్‌కు కూడా అక్కడ ఆదరణ ఉందనేది కొట్టిపారేయలేం" అని తాప్సీ పేర్కొంది.

డిమాండ్ ఉందని

సినీ పరిశ్రమ నడిచే తీరును వివరిస్తూ తాప్సీ మరింత కీలక వ్యాఖ్యలు చేసింది. "అంతా డిమాండ్, సరఫరా సూత్రంపైనే నడుస్తోంది. జనాలు ఇదే కోరుకుంటున్నారని, ఇలా చేస్తేనే డబ్బులు వస్తాయని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. దాంతో కళ, నటన పక్కకు వెళ్లిపోతున్నాయి. కోవిడ్ మహమ్మారి కంటే ముందు మన ఇండస్ట్రీ మంచి ప్రగతి సాధించింది.

దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'పెద్ది' చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర) రూపాన్ని, దుస్తులను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పాత్రలోని ఎమోషన్స్ కంటే కూడా ఆమె శారీరక సౌందర్యానికి, కెమెరా యాంగిల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని నెటిజన్లు మండిపడ్డారు.

ఈ వివాదం తీవ్రతను గ్రహించిన దర్శకుడు ఆ సీన్లను సినిమా నుంచి తొలగించడమే కాకుండా, బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు.

మరోవైపు యష్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' విషయంలోనూ ఇదే వివాదం చెలరేగింది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్లను కేవలం గ్లామర్, శృంగారం, హీరో చుట్టూ తిరిగే పాత్రలుగానే చూపించారని ప్రేక్షకులు విమర్శించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe