Netflix OTT: బాలీవుడ్‌లో వైవిధ్యమైన, లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటి తాప్సీ పన్ను. కథలో బలం ఉండి, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను తాప్సీ అలరిస్తోంది. ఆమె మరో పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతుంది. తాప్సీ గాంధారి మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది.
గాంధారి ఓటీటీ రిలీజ్ డేట్

స్టార్ హీరోయిన్ తాప్సీ లీడ్ రోల్ ప్లే చేసిన తాజా చిత్రం 'గాంధారి' (Gandhari). ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (ఆగస్టు 21) అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 3, 2026 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
థ్రిల్లింగ్ స్టోరీ
"ఎంతటి కష్టాలనైనా ఎదురించి నిలిచేది తల్లి ప్రేమ మాత్రమే" అనే బలమైన ఎమోషనల్ పాయింట్ తో గాంధారి సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. ఆపదలో చిక్కుకున్న తన కుమార్తెను కాపాడుకోవడానికి ఒక తల్లి ఏ స్థాయికైనా తెగించి పోరాడటాన్ని ఈ చిత్రంలో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించబోతున్నారు.
జాయ్‌పూర్రా అనే ఒక కాల్పనిక పట్టణ నేపథ్యంలో ఈ గాంధారి సినిమా కథ సాగుతుంది. కుమార్తె కిడ్నాప్ అయిన తర్వాత ఆ తల్లి అనుభవించిన వేదన, ఆ తర్వాత ఆమెలో రగిలిన కోపం, ప్రతీకారం, ఆత్మరక్షణ కోసం చేసిన పోరాటమే ఈ సినిమాకు ప్రధాన బలం.
వైవిధ్యమైన పాత్రలు
గాంధారి సినిమాలో తాప్సీ 'బాని' అనే ధైర్యవంతురాలైన తల్లి పాత్రలో కనిపిస్తారు. ఆమె కెరీర్లోనే అత్యంత శారీరక శ్రమతో కూడిన, కఠినమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్న చిత్రంగా ఇది నిలవనుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా, భారీ స్టంట్లతో తాప్సీ ఇందులో మెప్పించనున్నారు.
{{/usCountry}}గాంధారి సినిమాలో తాప్సీ 'బాని' అనే ధైర్యవంతురాలైన తల్లి పాత్రలో కనిపిస్తారు. ఆమె కెరీర్లోనే అత్యంత శారీరక శ్రమతో కూడిన, కఠినమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్న చిత్రంగా ఇది నిలవనుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా, భారీ స్టంట్లతో తాప్సీ ఇందులో మెప్పించనున్నారు.
{{/usCountry}}ఆమెతో పాటు ఇష్వాక్ సింగ్, స్వాస్తిక ముఖర్జీ, ఛాయా కదమ్, మితా వశిష్ట్, జతిన్ సర్నా వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవలం యాక్షన్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతీ పాత్రకు కథలో సరైన ప్రాధాన్యం ఉండేలా రూపొందించారు.
క్రేజీ కాంబినేషన్
'అజ్జీ', 'భోంస్లే', 'జోరమ్' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన దేవాశిష్ మఖిజా ఈ 'గాంధారి' చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ తన 'కథా పిక్చర్స్' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ స్వయంగా కథను అందించారు. 'హసీన్ దిల్‌రుబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా' చిత్రాల విజయం తర్వాత తాప్సీ, కనికా ధిల్లాన్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది.
తాప్సీ కెరీర్‌లో మరో మైల్ స్టోన్
సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకు, గ్లామర్‌కే పరిమితమవుతుంటాయనే అభిప్రాయాన్ని తాప్సీ మొదటి నుంచీ తిరస్కరిస్తూ వస్తున్నారు. 'హసీన్ దిల్‌రుబా'తో పాటు 'ఖేల్ ఖేల్ మే' వంటి చిత్రాలతో అలరించిన ఆమె, ఇప్పుడు 'గాంధారి'తో తన యాక్షన్ సత్తాను నిరూపించుకోనున్నారు. మున్ముందు రాబోతున్న 'వో లడ్కీ హై కహా' వంటి చిత్రాలతో పాటు 'గాంధారి' కూడా ఆమె కెరీర్‌లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోనుంది.