Mystery Web Series OTT: అనూహ్య మలుపులు, అదిరిపోయే థ్రిల్, ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉన్న వెబ్ సిరీస్ కోసం మీరు సెర్చ్ చేస్తున్నారా? అయితే జియోహాట్‌స్టార్ లో ఉన్న ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లను మీరు చూడాల్సిందే. అదే.. ‘తాజా ఖబర్’ వెబ్ సిరీస్. ఓటీటీలో మస్ట్ వాచ్ మిస్టరీ ఫాంటసీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది అని చెప్పొచ్చు.
తాజా ఖబర్ ఓటీటీ

పాపులర్ వెబ్ సిరీస్ తాజా ఖబర్ ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం రెండు సీజన్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఓటీటీలోకి మూడో సీజన్ రాబోతుంది. మూడో సీజన్ కోసం థ్రిల్లర్ ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఖబర్ వెబ్ సిరీస్ గురించి ఇక్కడ చూసేయండి.
వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?
తాజా ఖబర్ వెబ్ సిరీస్ లో మిస్టరీ, క్రైమ్, ఫాంటసీ థ్రిల్లర్ అంశాలున్నాయి. ముంబయిలోని మురికివాడలో వస్య అనే యువకుడు ఉంటాడు. అతను పబ్లిక్ టాయిలెట్లు క్లీన్ చేస్తూ బతుకుతుంటాడు. అతను ఓ సెక్స్ వర్కర్ అయిన మధును ప్రేమిస్తాడు. కానీ ఓ మంత్రి కన్ను మధుపై పడుతుంది.
అనుకోని వరంతో
పేదరికంలో ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్న వస్య జీవితంలో ఓ మిరాకిల్ జరుగుతుంది. వస్యకు అనుకోకుండా ఓ వరం లభిస్తుంది. తాజా వార్తల రూపంలో ఆ వరం కారణంగా వస్యకు ఫ్యూచర్ ముందే తెలిసిపోతుంది. ఈ వరం ఉపయోగించుకొని వస్య భారీగా డబ్బు సంపాదిస్తాడు.
తన ఫ్రెండ్ తో కలిసి బెట్టింగ్ లో వస్య డబ్బులు సంపాదిస్తాడు. చూస్తుండగానే ఫుల్ రిచ్ అయిపోతాడు. అతను లగ్జరీ లైఫ్ గడుపుతాడు. కానీ అప్పుడే అనుకోని కష్టాలు స్టార్ట్ అవుతాయి.
ఊహించని మలుపులు
{{/usCountry}}తన ఫ్రెండ్ తో కలిసి బెట్టింగ్ లో వస్య డబ్బులు సంపాదిస్తాడు. చూస్తుండగానే ఫుల్ రిచ్ అయిపోతాడు. అతను లగ్జరీ లైఫ్ గడుపుతాడు. కానీ అప్పుడే అనుకోని కష్టాలు స్టార్ట్ అవుతాయి.
ఊహించని మలుపులు
{{/usCountry}}తాజా ఖబర్ వెబ్ సిరీస్ పార్ట్ 1 అసలు ఎక్స్ పెక్ట్ చేయని ఎండింగ్ తో ముగుస్తుంది. ఆ ట్విస్టుకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక సెకండ్ సీజన్ కూడా అంతే ఉత్కంఠతో సాగుతుంది. వస్య జీవితంలో పరిస్థితులు ఎప్పటికప్పుడూ మారిపోతుంటాయి. వరంలో వచ్చే ఇబ్బందులతో పాటు తన శత్రువు యూసుఫ్ తో వస్య పోరాడాల్సి వస్తుంది.
యూట్యూబర్ హీరో
తాజా ఖబర్ వెబ్ సిరీస్ లో పాపులర్ యూట్యూబర్ భువన్ బామ్ హీరోగా నటించారు. ఇందులో ఇంకా శ్రియా పిల్గావ్ కర్, శిల్పా శుక్లా, ప్రథమేశ్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన జేడీ చక్రవర్తి, నిత్య మాథుర్ తదితరులు నటించారు.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.