...
...
Next Story

Slum Dog Tabu: రూత్‌లెస్ బోల్డ్ ఇన్‌క‌మ్ టాక్స్‌ ఆఫీసర్ గా టబు-యాక్షన్ అరాచకం-స్లమ్ డాగ్ గ్లింప్స్ మామూలుగా లేదు భయ్యా!

Slum Dog Tabu: స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి వర్సటైల్ యాక్ట్రెస్ టబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైంది. ఇన్‌కమ్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డేగా టబు పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ సొంత డబ్బింగ్‌తో మెప్పించింది.

Published on: Aug 10, 2026, 13:45:40 IST
Advertisement

Slum Dog Tabu Glimpse: మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరకెక్కుతున్న క్రేజీ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ (SlumDog: 33 Temple Road). ఈ సినిమాలో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సీనియర్ నటి టబు ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి టబు పాత్రకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

టబు గ్లింప్స్

రూత్‌లెస్ బోల్డ్ ఇన్‌క‌మ్ టాక్స్‌ ఆఫీసర్ గా టబు-యాక్షన్ అరాచకం-స్లమ్ డాగ్ గ్లింప్స్ మామూలుగా లేదు భయ్యా! (x/PuriConnects)
రూత్‌లెస్ బోల్డ్ ఇన్‌క‌మ్ టాక్స్‌ ఆఫీసర్ గా టబు-యాక్షన్ అరాచకం-స్లమ్ డాగ్ గ్లింప్స్ మామూలుగా లేదు భయ్యా! (x/PuriConnects)

విజయ్ సేతుపుతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ నుంచి ఇవాళ (ఆగస్టు 10) రిలీజైన టబు గ్లింప్స్ మామూలుగా లేదు. ఈ చిత్రంలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే ఇన్‌కమ్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ అనే పాత్రలో నటిస్తోంది. అత్యంత ధైర్యసాహసాలు కలిగిన, నిర్దాక్షిణ్యమైన పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా ఆమెను ఈ గ్లింప్స్‌లో చూపించారు. యాక్షన్ తో టబు ఊచకోత కోసిందనే చెప్పొచ్చు.

యాక్షన్ అవతార్

పూరీ జగన్నాథ్ సినిమా అంటేనే ఆర్టిస్టుల మేకోవర్ డిఫరెంట్ గా ఉంటుందనే టాక్ ఉంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా రిలీజైన స్లమ్ డాగ్ గ్లింప్స్ లో టబు క్యారెక్టర్ ఉంది. గ్లింప్స్‌లో కనిపిస్తున్న టబు ఇంటెన్స్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సొంతంగా తెలుగు డబ్బింగ్

ఈ పాత్ర ప్రత్యేకత ఏంటంటే, టబు తన పాత్రకు సంబంధించి తెలుగు డైలాగ్స్‌ను సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పింది. ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పడం వల్ల సీన్లలో ఆ ఇంటెన్సిటీ మరింత పెరిగింది. ఓ ఏరియాలోకి కార్లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన టబు అక్కడి జనాలను భయపెట్టిన తీరు వేరే లెవల్ లో ఉంది. సిగరెట్ తాగుతూ అందరితో ఆటాడుకుంటుంది టబు క్యారెక్టర్.

పూరీ-సేతుపతి మాస్ కాంబో

స్లమ్ డాగ్ నుంచి రిలీజైన టబు గ్లింప్స్ బీజీఎం కూడా అదిరిపోయేలా ఉంది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాల ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, జెబి నారాయణ్ రావు కొండ్రోళ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సరికొత్త కథాంశంతో మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమాగా స్లమ్ డాగ్ రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks