...
...
Next Story

Heroine: కన్నతల్లితోనే భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఆ మాట వినగానే మైండ్ బ్లాక్!

Heroine: ఓ స్టార్ హీరోయిన్ తన భర్త, తల్లి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి సంచలన నిజాలు బయటపెట్టింది. మసాజ్ తో మొదలైన ఈ వ్యవహారం తన సంసారాన్ని ఎలా కూల్చివేసిందో ఆమె వివరించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Published on: Mar 18, 2026, 13:27:19 IST
Advertisement

తైవానీస్ నటి జియాంగ్ పింగ్ తన జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటనను తాజాగా ఒక టాక్ షోలో పంచుకుంది. తన భర్త ఏకంగా ఆమె కన్నతల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు అని చెప్పుకొచ్చింది. 50 ఏళ్ల వయస్సులో ఉన్న జియాంగ్, తన గతాన్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఏం జరిగిందంటే?

హీరోయిన్ షాకింగ్ అనుభవం
హీరోయిన్ షాకింగ్ అనుభవం

జియాంగ్ తన 21 ఏళ్ల వయసులో తన కంటే 12 ఏళ్లు పెద్దవాడిని వివాహం చేసుకుంది. ఐదేళ్ల పాటు వీరి కాపురం సంతోషంగానే సాగింది. ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి. ఇక ఏడో ఏట నుంచి భర్త ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వచ్చింది.

ఇద్దరినీ

జియాంగ్ పై ఆమె భర్తకు ఇంట్రెస్ట్ పోయింది. తనను మాటలతో దూషించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అనుమానం వచ్చి జియాంగ్ తన భర్తను నిలదీయగా.. "నేను మీ ఇద్దరినీ (తల్లీ కూతుళ్లు) ఒకేసారి చూసుకోగలను" అని అతను చెప్పడంతో ఆమె మైండ్ బ్లాక్ అయింది.

తల్లిని నిలదీయగా..

భర్త మాటలతో అనుమానం వచ్చి వెంటనే తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన జియాంగ్ కు చేదు అనుభవం ఎదురైంది. తన తల్లి తలుపు తీసి, కూతురిని చూడగానే మళ్లీ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. తన తల్లికి ఏదో దాస్తుందని అప్పుడే జియాంగ్ కు అర్థమైంది.

మసాజ్‌తో మొదలై..

తన కన్నతల్లితో తన భర్త అక్రమ సంబంధం వ్యవహారం గురించి జియాంగ్ మాట్లాడుతూ భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. అత్త, అల్లుడి మధ్య మసాజ్ తో రిలేషన్ షిప్ మొదలైందని ఆమె పేర్కొంది.

తన తల్లితో తన భర్త అక్రమ సంబంధం తెలిసిన తర్వాత జియాంగ్ రగిలిపోయింది. వెంటనే భర్తకు విడాకులు ఇచ్చింది. తల్లితో కూడా పూర్తిగా సంబంధాన్ని తెంచుకుంది. ఈ షాకింగ్ అనుభవాన్ని ఆమె బయటకు వెల్లడించింది. దీంతో హీరోయిన్ కు ఇలా జరగడం కరెక్ట్ కాదని, ఆమె భర్తకు తగిన బుద్ధి చెప్పాలని నెటిజన్లు మండిపడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks