OTT Thriller: ఆరుగురు అమ్మాయిల హత్య.. కోమాలో ఉన్న హంతకుడు.. నేరుగా ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్
మైండ్ బ్లాక్ చేసే థ్రిల్ తో, ఊహకు అందని ట్విస్ట్ లతో సాగే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ ఇవాళ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆరుగురు అమ్మాయిలను హత్య చేసిన వ్యక్తి కోమాలో ఉంటాడు. అతను కోలుకున్న తర్వాత ఏం జరిగిందన్నది ఆసక్తి రేపుతుంది.
ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వస్తూనే ఉంటాయి. అయితే ఇందులో థ్రిల్లర్ జోనర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు థ్రిల్ తో ఊపేసే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమానే ‘ ది హంట్స్ మన్’. థ్రిల్లర్ లవర్స్ మిస్ అవకుండా చూడాల్సిన మూవీ ఇది.

ది హంట్స్ మన్ ఓటీటీ
ఓటీటీలు వచ్చాక భాష అనే భేదం లేకుండా అన్ని సినిమాలను ఆడియన్స్ చూసేస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ల విషయానికి వస్తే ఈ జోనర్ లో వచ్చే హాలీవుడ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ది హంట్స్ మన్ ఓటీటీలోకి వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 10) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
డైరెక్ట్ ఓటీటీ
ది హంట్స్ మన్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోని రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం నుంచి అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ లో చిన్న ట్విస్ట్ నెలకొంది. ఇప్పుడైతే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ది హంట్స్ మన్ మూవీ కేవలం రెంట్ విధానంలోనే అందుబాటులో ఉంది. అంటే ఈ సినిమా చూడాలంటే రెంట్ గా అమౌంట్ పే చేయాల్సిందే.
ఇంట్రెస్టింగ్ గా
ది హంట్స్ మన్ సినిమాలో షాన్ యాష్మోర్, గారెట్, ఎలిజబెత్ మిచెల్, జెస్సీ ష్రూమ్ తదితరులు నటించారు. ఈ మూవీరొ కైల్ కౌవిక హారిస్ డైరెక్టర్. ఈ చిత్రం నేరుగా ఈ రోజు ఓటీటీలోకి వచ్చింది. ట్రైలర్ లోని సీన్లు, స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
ది హంట్స్ మన్ స్టోరీ
మ్యాక్స్ (షాన్ యాష్మోర్) ఐసీయూ నర్స్ గా పని చేస్తుంటాడు. కోమాలో ఉన్న లింకన్ రైడర్ (గారెట్ డిల్లాహంట్)ను చూసుకోవడానికి మ్యాక్స్ వెళ్తాడు. లింకన్ ఆరుగురు అమ్మాయిలను చంపి కోమాలోకి వెళ్లాడని పోలీసులు భావిస్తారు. అతను కోమాలో నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేయొచ్చని అనుకుంటారు.
మరోవైపు తన భర్త లింకన్ ఏ మర్దర్ చేయలేదని, అతను నిర్దోషి అని భార్య వాదిస్తుంది. లింకన్ ను చూసుకోవడానికి వెళ్లిన మ్యాక్స్ కు కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. కొన్ని సీక్రెట్స్ బయటపడతాయి. అయితే ఒక రోజు లింకన్ కోమాలో నుంచి కోలుకుంటాడు. మరి నిజంగానే లింకన్ ఆ ఆరు హత్యలు చేశాడా? అతని రహస్యాలు ఏంటీ? అన్నది ది హంట్స్ మన్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


