...
...
Next Story

తమన్నా ఇంత సన్నగా మారడానికి ఆ ఇంజెక్షనే కారణమా? షారుక్ ఖాన్ కొడుకుతో ఉన్న వీడియో వైరల్.. అసలేంటా ఇంజెక్షన్?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె 'ఓజెంపిక్' అనే వెయిట్ లాస్ ఇంజెక్షన్ తీసుకుదంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌తో కనిపించిన వీడియోలో ఆమె లుక్ చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Published on: Feb 3, 2026, 16:15:30 IST
By
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన తమన్నా భాటియా.. తాజాగా సోషల్ మీడియాలో ఒక వివాదానికి కారణమైంది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో ఆమె మాట్లాడుతున్న ఒక వీడియో ఇటీవల బయటికి వచ్చింది. ఇందులో తమన్నా మునుపటి కంటే చాలా సన్నగా, ముఖం పీక్కుపోయినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె సహజంగా బరువు తగ్గలేదని, 'ఓజెంపిక్' (Ozempic) అనే ఇంజెక్షన్ వాడుతున్నారని రెడిట్ (Reddit) వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

తమన్నా అందమంతా ఆ వంపుల్లోనే ఉందంటూ..

తమన్నా ఇంత సన్నగా మారడానికి ఆ ఇంజెక్షనే కారణమా? షారుక్ ఖాన్ కొడుకుతో ఉన్న వీడియో వైరల్.. అసలేంటా ఇంజెక్షన్? (Instagram/tamannaahspeaks)
తమన్నా ఇంత సన్నగా మారడానికి ఆ ఇంజెక్షనే కారణమా? షారుక్ ఖాన్ కొడుకుతో ఉన్న వీడియో వైరల్.. అసలేంటా ఇంజెక్షన్? (Instagram/tamannaahspeaks)

తమన్నా అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నాజూకు వంపులు, ఆకర్షణీయమైన శరీరాకృతి. అయితే ఇప్పుడు ఆమె లుక్ చూసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. "ఆమె సహజ సిద్ధమైన అందాన్ని కోల్పోయింది. మిగతా సెలబ్రిటీలలాగే ఆమె కూడా ఇప్పుడు బలహీనంగా కనిపిస్తోంది" అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరొకరు స్పందిస్తూ.. "స్త్రీ 2 సినిమాలోని 'ఆజ్ కీ రాత్' పాటలో తమన్నా ఎంత అద్భుతంగా ఉందో చూశాం. ఆమె లావుగా లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. కానీ ఇప్పుడు ఆమె కూడా అందరు హీరోయిన్లలా సన్నగా మారే రేసులో పడిపోయింది. ఆ కర్వీ బాడీని ఆమె అలాగే మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది" అని అభిప్రాయపడ్డారు.

ఆ ఇంజెక్షన్ వల్లేనా?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కసారిగా బరువు తగ్గడం వెనుక 'ఓజెంపిక్' ఇంజెక్షన్ ఉందని నెటిజన్లు గట్టిగా నమ్ముతున్నారు. "ఓజెంపిక్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో, అప్పటి నుంచే సెలబ్రిటీల ఫిట్‌నెస్ రొటీన్లు మ్యాజిక్ చేయడం మొదలుపెట్టాయి" అని ఒకరు సెటైర్ వేశారు. "మేము రోజుకు ఒక పూటే తింటున్నాం అని వీళ్ళు కవరింగ్ ఇస్తుంటారు. కానీ అసలు విషయం వేరే ఉంది" అని మరొకరు విమర్శించారు.

తమన్నా ఏమన్నదంటే?

ఓజెంపిక్ అనేది టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ నియంత్రించడానికి వాడే ఒక ఇంజెక్షన్. అయితే ఇది ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుండటంతో.. చాలామంది దీనిని వెయిట్ లాస్ కోసం వాడుతున్నారు. బాలీవుడ్‌లో రామ్ కపూర్ వంటి నటులు తాము దీనిని వాడినట్లు బహిరంగంగానే అంగీకరించారు.

సెప్టెంబర్ 2025లో ఈ మందు ఇండియాలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. దీని ఖర్చు నెలకు రూ. 10,000 నుంచి రూ. 12,000 వరకు ఉంటుందని సమాచారం. అయితే డాక్టర్ల సలహా లేకుండా ఇలాంటివి వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks