Actor Director K Bhagyaraj Passed Away At Age 73: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన విలక్షణమైన కథలు, నవ్వులు పూయించే స్క్రీన్‌ప్లేతో ఎనభై, తొంభైల కాలంలో యావత్ ప్రేక్షకులను ఊపేసిన ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ శనివారం (జూన్ 27) కన్నుమూశారు.
73 ఏళ్ల వయసులో

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భాగ్యరాజ్ తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలిచించక మరణించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన వయసు 73 సంవత్సరాలు.
"భాగ్యరాజ్ హఠాన్మరణాన్ని అపోలో ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి" అని జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. కె. భాగ్యరాజ్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
కొద్దిరోజుల క్రితమే ఆయన గోవాలో జరిగిన నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై అందరితో ఎంతో ఉత్సాహంగా గడిపారు. అంతలోనే ఈ విషాద వార్త వినాల్సి రావడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ను కూడా కలచివేస్తోంది. ఆయనకు భార్య పూర్ణిమ (సీనియర్ నటి), కుమారుడు శాంతను భాగ్యరాజ్ (నటుడు), కుమార్తె శరణ్య ఉన్నారు.
భారతీరాజా శిష్యుడిగా ప్రస్థానం
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కృష్ణస్వామి భాగ్యరాజ్‌గా జన్మించిన ఆయనకు చిన్నప్పటి నుంచే సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో లెజెండరీ దర్శకుడు భారతీరాజా వద్ద అసోసియేట్‌గా చేరి సినిమా నిర్మాణంలోని మెళకువలను నేర్చుకున్నారు.
'16 వయదినేలే' (తెలుగులో పదహారేళ్ల వయసు), 'సిగప్పు రోజాక్కల్' వంటి క్లాసిక్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీరాజా దర్శకత్వం వహించిన 'కిళక్కే పోగుమ్ రైల్', 'టిక్ టిక్ టిక్' చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడం ద్వారా తనలోని అద్భుతమైన రచయితను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత 1979లో 'సువరిల్లాద చిత్రంగల్' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు.
స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా సరికొత్త శకం
{{/usCountry}}'16 వయదినేలే' (తెలుగులో పదహారేళ్ల వయసు), 'సిగప్పు రోజాక్కల్' వంటి క్లాసిక్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీరాజా దర్శకత్వం వహించిన 'కిళక్కే పోగుమ్ రైల్', 'టిక్ టిక్ టిక్' చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడం ద్వారా తనలోని అద్భుతమైన రచయితను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత 1979లో 'సువరిల్లాద చిత్రంగల్' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు.
స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా సరికొత్త శకం
{{/usCountry}}మధ్యతరగతి కుటుంబాల కథలను, వారి జీవితాల్లోని సుఖదుఃఖాలను వెండితెరపై ఆవిష్కరించడంలో భాగ్యరాజ్ శైలి ప్రత్యేకం. అశ్లీలతకు తావులేకుండా కేవలం మాటల చాతుర్యంతో, సున్నితమైన హాస్యంతో ఆయన రాసుకునే స్క్రీన్‌ప్లేలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. అందుకే ఆయన్ను పరిశ్రమలో 'స్క్రీన్‌ప్లే మాంత్రికుడు' అని పిలుచుకుంటారు.
'అన్త ఏలు నాట్కల్', 'ముంధానై ముడిచ్చు', 'తూరల్ నిన్ను పోచ్చు', 'ఇంద్రు పోయ్ నాళై వా' వంటి చిత్రాలు తమిళ సినిమా చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఈ చిత్రాలలో చాలావరకు తెలుగులో రీమేక్ అయి ఇక్కడి స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించాయి. తన సుదీర్ఘ కెరీర్‌లో భాగ్యరాజ్ 25 కంటే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించగా, 75కి పైగా సినిమాల్లో హీరోగా, కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
బిగ్ బీ అమితాబ్‌ను డైరెక్ట్ చేసిన ప్రతిభ
భాగ్యరాజ్ ప్రతిభ కేవలం దక్షిణాదికే పరిమితం కాలేదు. బాలీవుడ్ షహన్‌షా అమితాబ్ బచ్చన్‌ను సైతం ఆయన డైరెక్ట్ చేశారు భాగ్యరాజ్. అమితాబ్ ద్విపాత్రాభినయంలో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా 'ఆఖ్రీ రాస్తా' (1986) చిత్రానికి భాగ్యరాజ్ దర్శకుడు. శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీలో భారీ వసూళ్లు సాధించింది.
ఆ తర్వాత అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన 'మిస్టర్ బేచారా', 'పాపా ది గ్రేట్' వంటి హిందీ చిత్రాలలోనూ ఆయన కీలక సహాయక పాత్రలు పోషించి ఉత్తర భారత ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
భాగ్యరాజ్ అంత్యక్రియలు
భాగ్యరాజ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు కుటుంబ సభ్యుల నుంచి తెలియాల్సి ఉంది. ఆయన మృతితో చిత్రసీమ ఒక గొప్ప సృజనశీల నటుడిని, అద్భుతమైన కథకుడిని కోల్పోయింది.