...
...
Next Story

OTT Telugu: తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న తమిళ బోల్డ్ మూవీ సీక్వెల్.. ఇప్పటికే ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్

తమిళ బోల్డ్ మూవీ హాట్ స్పాట్ 2 మచ్ (Hot Spot 2 Much) తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మధ్యే తమిళ వెర్షన్ ఏకంగా ఆరు ఓటీటీల్లోకి రాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ గురించి కూడా అప్డేట్ వచ్చేసింది.

Published on: Feb 24, 2026, 20:56:58 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈవారం ఓటీటీల్లోకి ఓ ఇంట్రెస్టింగ్ తమిళ సినిమా తెలుగు వెర్షన్ కూడా రాబోతోంది. ఈ మూవీ పేరు హాట్ స్పాట్ 2 మచ్. రెండేళ్ల కిందట వచ్చిన హాట్ స్పాట్ సినిమాకు ఇది సీక్వెల్. అప్పట్లో తమిళ, తెలుగు వెర్షన్లు రెండూ ఒకేసారి వచ్చినా.. ఈసారి తమిళ వెర్షన్ కాస్త ముందుగా వచ్చింది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 27) తెలుగు వెర్షన్ రాబోతోంది.

హాట్ స్పాట్ 2 మచ్ ఓటీటీ స్ట్రీమింగ్

OTT Telugu: తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న తమిళ బోల్డ్ మూవీ సీక్వెల్.. ఇప్పటికే ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
OTT Telugu: తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న తమిళ బోల్డ్ మూవీ సీక్వెల్.. ఇప్పటికే ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్

తమిళ మూవీ హాట్ స్పాట్ 2 మచ్ గత వారమే ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎందులోనూ తెలుగు వెర్షన్ రాకపోవడంతో ఇక్కడి ప్రేక్షకులు నిరాశ చెందారు. తాజాగా ఆహా వీడియో ఓటీటీ శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి మూవీని తెలుగులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.

“మూడు బోల్డ్ స్టోరీలు.. ఒక ఆశయంతో సాగే డైరెక్టర్. మీరు ఊహించని రహస్యమైన ఎజెండా.. హాట్ స్పాట్ 2 మచ్ తెలుగు ఫిబ్రవరి 27న ఆహాలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఇప్పటికే తమిళ వెర్షన్ ఆరు ఓటీటీల్లో ఉంది. అందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళం, లయన్స్‌గేట్ ప్లే, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమాలాంటివి ఉన్నాయి.

హాట్ స్పాట్ 2 మచ్ మూవీ విశేషాలు

విగ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన తమిళ మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్' (Hot Spot 2 Much). తమిళ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో, ముఖ్యంగా బోల్డ్, కాంట్రవర్షియల్ అంశాలతో సినిమాలు తీసే దర్శకుడిగా ఇతనికి పేరుంది. అతడు గతంలో అంటే 2024లో తీసిన 'హాట్ స్పాట్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన తాజా మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్'. ఈ కథ ఒక హైపర్ లింక్ సినిమా. అంటే వేర్వేరు కథలు ఒకే చోట కలవడం లేదా సమాంతరంగా సాగడం. ఈ సినిమాను ప్రధానంగా మూడు సెగ్మెంట్లుగా విభజించారు. ఇందులో సమాజంలో ఉన్న కొన్ని సీరియస్, సెన్సిటివ్ అంశాలను చర్చించారు.

ఇలాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఓటీటీలో ఇలాంటి కంటెంట్‌కు ఆదరణ దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

హాట్ స్పాట్ 2 మచ్ నటీనటులు

ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. ప్రియా భవాని శంకర్, ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్య, రక్షాన్, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, భవాని శ్రీ, బ్రిగిడా సాగా, సంజన తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సతీష్ రఘునాథన్ సంగీతం అందించగా, జగదీష్ రవి, జోసెఫ్ పాల్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఇక ఈ మూవీ సిరీస్‌లో వచ్చిన మొదటి సినిమా 'హాట్ స్పాట్' (Hot Spot) కూడా ఆహా తమిళంలో అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe