OTT Crime Thriller: ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ రాత్రింబవళ్లు పడే శ్రమ, కేసు విచారణలో ఎదురయ్యే ప్రాణసంకటాలు, నిద్రలేని రాత్రులు, సరిహద్దు దాటి వెళ్లినప్పుడు అనుభవించే మానసిక నరకం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే ‘ధీరన్ అధిగారం ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకీ’ - Khakee).

విడుదలై ఏళ్లు గడుస్తున్నా, సోషల్ మీడియాలో ఈ సినిమా ఇప్పటికీ నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఐఎండీబీ (IMDb)లో 8.2/10 అత్యుత్తమ రేటింగ్‌తో నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ ఏంటి? అసలు ఎందుకు చూడాలో తెలుసుకోండి.
తమిళనాడును వణికించిన దారిదోపిడీ ముఠా.. కథేంటంటే?
కథ విషయానికి వస్తే.. నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ ధీరన్ తిరుమారన్ (కార్తి) చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. తమిళనాడులోని నేషనల్ హైవేల సమీపంలో ఉన్న ఒంటరి ఇళ్లే లక్ష్యంగా భయంకరమైన దారిదోపిడీలు జరుగుతుంటాయి.
రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడే ఒక క్రూరమైన ముఠా, ఇంట్లోని వారిని అత్యంత దారుణంగా హత్య చేసి నగలూ, డబ్బు దోచుకెళ్తుంటారు. హంతకులు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలాంటి ఆధారాలు వదలకుండా ఎలా మాయమవుతున్నారు? అనే ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం ఉండదు.
ఆరంభంలో ఇది స్థానిక దొంగల పని అని భావించినప్పటికీ, కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం ఈ విచారణను డీఎస్పీ ధీరన్‌కు అప్పగిస్తుంది. కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన ముఠా కాదని, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి దాడులు చేస్తున్న 'బవారియా' (Bawaria Gang) క్రిమినల్ గ్యాంగ్ అని ధీరన్ గుర్తిస్తాడు. ఆ తర్వాత ఆ ముఠాను పట్టుకోవడానికి ధీరన్ అండ్ టీమ్ చేపట్టిన సుదీర్ఘ వేట ఏ తీరాలకు చేరిందనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
నిజమైన ఇన్వెస్టిగేషన్.. సూపర్ హీరో బిల్డప్‌లు ఉండవు
ఈ సినిమాను మిగతా పోలీస్ డ్రామాల కంటే ప్రత్యేకంగా నిలిపేది ఇందులో చూపించిన రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్. దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని తమిళనాడు పోలీసుల నిజ జీవిత 'ఆపరేషన్ బవారియా' ఆధారంగా అద్భుతంగా మలిచారు.
{{/usCountry}}ఈ సినిమాను మిగతా పోలీస్ డ్రామాల కంటే ప్రత్యేకంగా నిలిపేది ఇందులో చూపించిన రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్. దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని తమిళనాడు పోలీసుల నిజ జీవిత 'ఆపరేషన్ బవారియా' ఆధారంగా అద్భుతంగా మలిచారు.
{{/usCountry}}పాత రికార్డులను తిరగేయడం, దశాబ్దాల నాటి వేలిముద్రలను సరిపోల్చడం లాంటి సాంకేతిక అంశాలను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. కేవలం నేరాన్ని కనిపెట్టడమే కాకుండా, రాజస్థాన్, హర్యానా సరిహద్దుల వైపు వెళ్లి విచారణ జరిపేటప్పుడు ఎదురయ్యే భాషా సమస్యలు, పరిపాలనాపరమైన ఆటంకాలు, తెలియని ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి పోరాడే తీరు ప్రేక్షకుడికి నరనరాన ఉత్కంఠను కలిగిస్తుంది.
కార్తి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్
డీఎస్పీ ధీరన్ పాత్రలో కార్తి జీవించేశారనే చెప్పాలి. ఒక నిబద్ధత గల పోలీస్ ఆఫీసర్‌గా ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు, కేసు చిక్కుముడులు విప్పే క్రమంలో అనుభవించే తీవ్ర మానసిక ఒత్తిడిని, అలసటను తన కళ్లతోనే పండించారు. ఎక్కడా సినిమాటిక్ ఓవర్ యాక్షన్ లేకుండా చాలా నేచురల్‌గా నటించారు.
ఇక ఈ చిత్రంలో విలన్ ‘ఓమా’ పాత్రలో నటించిన అభిమన్యు సింగ్ నటన చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎక్కువ డైలాగులు లేకుండా, కేవలం తన చూపులు, క్రూరమైన చర్యలతోనే ప్రేక్షకుల్లో భయాన్ని కలిగిస్తారు. విలన్ గ్యాంగ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ఒక రకమైన ఆందోళన వాతావరణం ఏర్పడుతుంది.
కట్టిపడేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఎలాంటి సంభాషణలు లేని సీన్స్‌లో కూడా రీ-రికార్డింగ్ ద్వారా ఉత్కంఠను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎడారి ఛేజింగ్ సీన్స్, నైట్ రైడింగ్ సన్నివేశాల్లో సంగీతం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
కథ ప్రారంభంలో వచ్చే 20-30 నిమిషాల లవ్ ట్రాక్ కొంత నెమ్మదిగా అనిపించినప్పటికీ, ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఎక్కిన తర్వాత సినిమా ఎక్కడా విరామం లేకుండా పరుగులు పెడుతుంది. పక్కా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మైండ్ గేమ్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అస్సలు మిస్ అవ్వకండి.