...
...
Next Story

OTT Today: ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. రెండేళ్ల కిందటి మూవీకి సీక్వెల్ ఇది.. తెలుగు వెర్షన్‌ ఎక్కడ?

ఒకే రోజు ఒకే సినిమా ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చిందంటే నమ్మగలరా? కానీ ఓ తమిళ మూవీ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఈ సినిమా పేరు హాట్ స్పాట్ 2 మచ్. రెండేళ్ల కిందట వచ్చిన మూవీకి సీక్వెల్ ఇది.

Published on: Feb 20, 2026, 13:58:26 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

సాధారణంగా ఓ సినిమా ఒకే ఓటీటీలోకి.. లేదంటే రెండు ఓటీటీల్లోకి రావడం చూశాం. మరీ అరుదుగా మూడింట్లోనూ స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ హాట్ స్పాట్ 2 మచ్ అనే ఈ మూవీ మాత్రం ఒకే రోజు ఆరు ఓటీటీల్లోకి వచ్చింది. చాలా బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే అంటే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) నుంచే స్ట్రీమింగ్ మొదలైంది.

హాట్ స్పాట్ 2 మచ్ ఓటీటీ రిలీజ్

OTT Today: ఒకే రోజు ఆరు ఓటీటీల్లోకి వచ్చిన తమిళ సినిమా.. రెండేళ్ల కిందటి మూవీకి సీక్వెల్ ఇది.. తెలుగు వెర్షన్‌ ఎక్కడ?
OTT Today: ఒకే రోజు ఆరు ఓటీటీల్లోకి వచ్చిన తమిళ సినిమా.. రెండేళ్ల కిందటి మూవీకి సీక్వెల్ ఇది.. తెలుగు వెర్షన్‌ ఎక్కడ?

విగ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన తమిళ మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్' (Hot Spot 2 Much). తమిళ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో, ముఖ్యంగా బోల్డ్, కాంట్రవర్షియల్ అంశాలతో సినిమాలు తీసే దర్శకుడిగా ఇతనికి పేరుంది. అతడు గతంలో అంటే 2024లో తీసిన 'హాట్ స్పాట్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన తాజా మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్'. ఇప్పుడీ సినిమా ఈరోజు నుంచి ఏకంగా ఆరు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళం, లయన్స్‌గేట్ ప్లే, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమాలాంటి వాటిలోకి రావడం విశేషం.

తెలుగు వెర్షన్ ఎక్కడ?

అయితే ఇన్ని ప్లాట్‌ఫామ్స్ లోకి మూవీ వచ్చినా తెలుగు వెర్షన్ పై మాత్రం క్లారిటీ లేదు. దేనిలోనూ తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి రాలేదు. లయన్స్‌గేట్ ప్లేలో మాత్రం హిందీ వెర్షన్ ఉంది. నిజానికి హాట్ స్పాట్ మూవీ తెలుగులోనూ థియేటర్లలో రిలీజైనా.. ఈ సీక్వెల్ పై మాత్రం క్లారిటీ లేదు. తమిళ వెర్షన్ ను ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సిందే. త్వరలోనే తెలుగు వెర్షన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

హాట్ స్పాట్ 2 మచ్ స్టోరీ, విశేషాలు

టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ అంటే హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేది ఒకటి. మరొకటి స్వలింగ సంపర్కుల వివాహం చుట్టూ ఉన్న చర్చ కాగా.. మూడోది ఒక వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, సమాజం చూసే చూపు చుట్టూ తిరుగుతుంది.

ఇలాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఓటీటీలో ఇలాంటి కంటెంట్‌కు ఆదరణ దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

హాట్ స్పాట్ 2 మచ్ నటీనటులు

ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. ప్రియా భవాని శంకర్, ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్య, రక్షాన్, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, భవాని శ్రీ, బ్రిగిడా సాగా, సంజన తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సతీష్ రఘునాథన్ సంగీతం అందించగా, జగదీష్ రవి, జోసెఫ్ పాల్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఇక ఈ మూవీ సిరీస్‌లో వచ్చిన మొదటి సినిమా 'హాట్ స్పాట్' (Hot Spot) కూడా ఆహా తమిళంలో అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe