...
...
Next Story

OTT: ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి రాబోతున్న తమిళ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్

ఇప్పుడో తమిళ సినిమా ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఒకే రోజు అడుగుపెట్టబోతోంది. గత నెల 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కానుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

Published on: Feb 16, 2026, 15:08:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

విగ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన తమిళ మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్' (Hot Spot 2 Much) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. బోల్డ్ కంటెంట్, సామాజిక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి రానుంది. మరి ఆ ఓటీటీలు ఏవి? ఈ మూవీ విశేషాలేంటన్నది చూడండి.

హాట్‌స్పాట్ 2 మచ్ ఓటీటీ వివరాలు

OTT: ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి రాబోతున్న తమిళ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
OTT: ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి రాబోతున్న తమిళ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్

తమిళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో, ముఖ్యంగా బోల్డ్, కాంట్రవర్షియల్ అంశాలతో సినిమాలు తీసే దర్శకుడు విగ్నేష్ కార్తీక్. అతడు గతంలో అంటే 2024లో తీసిన 'హాట్ స్పాట్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన తాజా మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్'. జనవరి 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

సాధారణంగా ఒక సినిమా ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంది. కానీ 'హాట్ స్పాట్ 2 మచ్' మాత్రం మల్టీ-ప్లాట్‌ఫామ్ డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి ఏకంగా ఆరు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. అందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళం, లయన్స్‌గేట్ ప్లే, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమాలాంటి వాటిలోకి అడుగుపెట్టనుండటం విశేషం.

హాట్ స్పాట్ 2 మచ్ స్టోరీ, విశేషాలు

విగ్నేష్ కార్తీక్ స్వీయ దర్శకత్వంలో, అతడే స్వయంగా రాసుకున్న ఈ కథ ఒక హైపర్ లింక్ సినిమా. అంటే వేర్వేరు కథలు ఒకే చోట కలవడం లేదా సమాంతరంగా సాగడం. ఈ సినిమాను ప్రధానంగా మూడు సెగ్మెంట్లుగా విభజించారు. ఇందులో సమాజంలో ఉన్న కొన్ని సీరియస్, సెన్సిటివ్ అంశాలను చర్చించారు.

ఇలాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఓటీటీలో ఇలాంటి కంటెంట్‌కు ఆదరణ దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

హాట్ స్పాట్ 2 మచ్ నటీనటులు

ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. ప్రియా భవాని శంకర్, ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్య, రక్షాన్, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, భవాని శ్రీ, బ్రిగిడా సాగా, సంజన తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సతీష్ రఘునాథన్ సంగీతం అందించగా, జగదీష్ రవి, జోసెఫ్ పాల్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఇక ఈ మూవీ సిరీస్‌లో వచ్చిన మొదటి సినిమా 'హాట్ స్పాట్' (Hot Spot) కూడా ఆహా తమిళ్‌లో అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks