...
...
Next Story

TV Actress: బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య- వీడియో కాల్‌లో భర్తతో గొడవే కారణం-బర్త్ డే, యానివర్సీరికి ముందుగా విషాదం!

Serial Actress Subashini Balasubramaniyam Suicide: ప్రముఖ బుల్లితెర, వెండితెర నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో వీడియో కాల్‌లో గొడవ జరిగిన తర్వాత ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Apr 8, 2026, 06:23:46 IST
Advertisement

తమిళ బుల్లితెరపై విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ సీరియల్ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం మంగళవారం (ఏప్రిల్ 7) చెన్నైలోని అయ్యప్పన్ తాంగల్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. కేవలం 36 ఏళ్ల వయసులోనే సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం ఇటు చిత్ర పరిశ్రమను, అటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఘటనకు గల కారణాలు

బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య- వీడియో కాల్‌లో భర్తతో గొడవే కారణం-బర్త్ డే, యానివర్సీరికి ముందుగా విషాదం!
బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య- వీడియో కాల్‌లో భర్తతో గొడవే కారణం-బర్త్ డే, యానివర్సీరికి ముందుగా విషాదం!

ప్రాథమిక సమాచారం ప్రకారం, సుభాషిణి తన భర్త బిబిన్ చంద్రతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. కుటుంబ కలహాలే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. మనస్తాపానికి గురైన సుభాషిణి ఆవేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పుట్టినరోజు (ఏప్రిల్ 12), రెండో వివాహ వార్షికోత్సవం (ఏప్రిల్ 21) దగ్గరపడుతున్న తరుణంలోనే సుభాషిణి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

భర్త ఆవేదన: "నన్ను వదిలి ఎందుకు వెళ్లావు?"

సుభాషిణి మరణవార్త తెలుసుకున్న ఆమె భర్త బిబిన్ చంద్ర సోషల్ మీడియా వేదికగా ఎంతో భావోద్వేగంతో స్పందించారు. "నా ప్రేమ, నా బొబ్బ.. ఇక లేవంటే నమ్మలేకపోతున్నాను. నన్ను నీకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేదు. నీ జ్ఞాపకాలు నాలో ఎప్పటికీ ఉంటాయి. మన పాప గురించి, ప్రపంచమంతా చుట్టేయాలని మనం ఎన్నో కలలు కన్నాం. వాటన్నింటినీ వదిలేసి ఎందుకు వెళ్లావు?" అంటూ బిబిన్ చంద్ర పెట్టిన పోస్ట్ నెటిజన్ల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తోంది.

షాక్‌లో అభిమానులు

మరణానికి కేవలం ఒక్క రోజు ముందే సుభాషిణి సుబ్రహ్మణ్యం తన కెన్యా పర్యటనకు సంబంధించిన అందమైన వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించిన బుల్లితెర నటి మరుసటి రోజే ప్రాణాలు తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. "జీవితం ఎంత అస్థిరమైనది.. నిన్న అంత సంతోషంగా ఉన్న మనిషి ఈరోజు లేదంటే నమ్మలేకున్నాం" అంటూ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కెరీర్ నేపథ్యం

గమనిక: ఆత్మహత్య ఆలోచనలు ఉంటే దయచేసి ఒంటరిగా బాధపడకండి. నిపుణుల సాయం తీసుకోండి.

ఆసరా హెల్ప్‌లైన్: 022 2754 6669

స్నేహ ఇండియా ఫౌండేషన్: +91 44 2464 0050

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe