కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇటీవల దుబాయ్ వాచ్ వీక్‌లో పాల్గొన్నారు. అక్కడ ఆయన వాచ్‌ల పట్ల తన ప్రేమను ప్రేరేపించిన ఒక ప్రత్యేకమైన వాచ్ గురించి మాట్లాడారు. చాలా మంది ఊహించినట్లుగా, అది ఖరీదైన రోలెక్స్, ఒమేగా లేదా ఆడిమార్స్ పిగెట్ కాదు. ఆ వాచ్ ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
ధనుష్ కు ఇష్టమైన వాచ్

ధనుష్ కు ఖరీదైన వాచ్ ల కంటే కూడా తన చిన్నతనంలో అమ్మ కొనిచ్చిన వాచ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. దాని ధర కచ్చితంగా షాక్ కలిగిస్తుంది. ఎందుకంటే దాని రేట్ ఒక డాలర్ (రూ.89) కంటే తక్కువే కావడం గమనార్హం.
“నేను ప్రేమలో పడ్డ మొదటి వాచ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు అమ్మ నాకు కొనిచ్చిన వాచ్. దాని ధర డాలర్ లోపే. దానిపై ఎలాంటి పేరు లేదు. అది ప్లాస్టిక్‌తో చేసింది. డిజిటల్ వాచ్. కేవలం సమయాన్ని మాత్రమే చూపిస్తుంది. ఒక లైట్ ఉంటుంది. దాని బ్యాటరీ అయిపోతుంది. దాని వెనుక ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది” అని ధనుష్ వెల్లడించారు.
పని చేయకపోయినా
ఆ వాచ్‌ను ధనుష్ ఎంతగానో ప్రేమించారు. ఆ విషయాలు పంచుకున్నారు. “నేను చాలా సాధారణ నేపథ్యం నుండి వచ్చా. బ్యాటరీలు అయిపోతే పనిచేయని వాచ్ పెట్టుకున్నా. అది చాలా రంగుల్లో వచ్చేది. నా అక్కాచెల్లెళ్లు వైలెట్, పసుపు, ఆకుపచ్చ.. ఇలా రంగులు ఎంచుకునేవాళ్లం. అది చాలా మెరిసిపోతూ, ఆకర్షణీయంగా ఉండేది. బ్యాటరీ డౌన్ అయినా, నేను ఆ వాచ్‌ను వేసుకుని స్కూల్‌కు వెళ్లేవాడిని. సమయం చూపించడం ఆగిపోయినా నేను దాన్ని పెట్టుకునేవాణ్ని. నిజంగా నేను ఆ వాచ్‌తో ప్రేమలో పడ్డా” అని ధనుష్ చెప్పారు.
ఇప్పటికీ ఇంట్లో
ధనుష్ ఆ వాచ్‌ను ఎంతగానో ప్రేమిస్తారు. చెన్నైలోని తన ఇంట్లో ఇప్పటికీ ఉందని ఆయన చెప్పారు. “కాబట్టి నేను ఇప్పటికీ ఆ వాచ్ ను కలిగి ఉన్నా. అది పని చేయదు లేదా మరేమీ చేయదు. కానీ నేను దాన్ని ఇంట్లో ఒక కేస్‌లో భద్రంగా ఉంచుకున్నా” అని ఆయన అన్నారు. ఈ నటుడు-దర్శకుడు కొన్నిసార్లు పురుషులు ఫాస్ట్ కార్లు లేదా గేమింగ్‌తో ప్రేమలో పడతారని, కానీ తాను మాత్రం వాచ్‌లను ప్రేమించడం నేర్చుకున్నానని కూడా తెలిపారు.
{{/usCountry}}ధనుష్ ఆ వాచ్‌ను ఎంతగానో ప్రేమిస్తారు. చెన్నైలోని తన ఇంట్లో ఇప్పటికీ ఉందని ఆయన చెప్పారు. “కాబట్టి నేను ఇప్పటికీ ఆ వాచ్ ను కలిగి ఉన్నా. అది పని చేయదు లేదా మరేమీ చేయదు. కానీ నేను దాన్ని ఇంట్లో ఒక కేస్‌లో భద్రంగా ఉంచుకున్నా” అని ఆయన అన్నారు. ఈ నటుడు-దర్శకుడు కొన్నిసార్లు పురుషులు ఫాస్ట్ కార్లు లేదా గేమింగ్‌తో ప్రేమలో పడతారని, కానీ తాను మాత్రం వాచ్‌లను ప్రేమించడం నేర్చుకున్నానని కూడా తెలిపారు.
{{/usCountry}}ధనుష్ సినిమాలు
ధనుష్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బిజీగా మారిపోయారు. ఈ సంవత్సరం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'కుబేర' చిత్రంలో నటించారు. ఇది తమిళం, తెలుగులో విడుదలైంది. ఆయన 'ఇడ్లీ కడై'కి రచన, దర్శకత్వం, నిర్మాణం చేసి, నటించారు. ధనుష్ తన మేనల్లుడు పావిష్‌ను 'నిలవకు ఎం మెల్ ఎంనడి కొబం' చిత్రంతో పరిచయం చేశారు. దీనికి ఆయన దర్శకత్వం వహించి, నిర్మించారు. త్వరలో ఆయన 'తేరే ఇష్క్ మే' చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.