Tammareddy Bharadwaja: అనిల్ రావిపూడి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు-ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు: తమ్మారెడ్డి భరద్వాజ
Tammareddy Bharadwaja: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అనిల్ పెద్ద డైరెక్టర్ అయిపోయాడని, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని తమ్మారెడ్డి అన్నాడు. మరి ఈ మాటల్లో ట్విస్ట్ ఏంటో ఇక్కడ చూసేయండి.
Tammareddy Bharadwaja: తెలుగు చిత్రసీమలో ఏ విషయమైనా ముక్కుసూటిగా, నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తులలో సీనియర్ విశ్లేషకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఒకరు. ఇండస్ట్రీలో ఎంతటి పెద్ద స్టార్ లేదా డైరెక్టర్ అయినా సరే.. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం ఆయన శైలి. తాజాగా ‘వదల’ చిత్ర ప్రమోషన్ల వేదికగా తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.

తమ్మారెడ్డి కామెంట్లు
టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ క్రేజీ దర్శకుడితో వర్క్ చేయడానికి బడా హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో జగపతిబాబు, లయ నటిస్తున్న ‘వదల’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన అనిల్ రావిపూడిని ఉద్దేశించి తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
అనిల్ రావిపూడి పెద్ద డైరెక్టర్
"అనిల్ రావిపూడి ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఒక ఈవెంట్ కోసం పిలిస్తే వస్తాడో లేదో అనుకున్నా. ‘అదేం లేదు గురువు గారు ఫోన్ చేయండి’ అని అన్నాడు. కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి ఇలా చేశాడని అనుకున్నా. కానీ సాయంత్రం మళ్లీ కాల్ బ్యాక్ చేశాడు. వదలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలంటే వస్తానన్నాడు. మాట మీద నిలబడ్డాడు" అని తమ్మారెడ్డి తెలిపారు.
అలాగే ఏడిపించేవాళ్లం
"మేము కూడా ఒకప్పుడు డైరెక్టర్ గా పెద్ద పొజిషన్‌లో ఉన్నప్పుడు అందరినీ అలాగే ఏడిపించేవాళ్ళం. ఫోన్లు ఎత్తేవాళ్లం కాదు. కాబట్టి అనిల్ అలా చేయడంలో వింతేమీ లేదు" అంటూ స్పోర్టివ్‌గా సమాధానమిచ్చి అందరినీ నవ్వించారు తమ్మారెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
జగపతి బాబు, లయ రీ ఎంట్రీ
ఒకప్పుడు టాలీవుడ్‌లో హోమ్లీ హీరోయిన్‌గా ‘స్వయంవరం’, ‘ప్రేమించు’ వంటి చిత్రాలతో అలరించిన లయ.. పెళ్లి తర్వాత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ‘వదల’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. జగపతి బాబు కూడా చాలా గ్యాప్ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
జగపతి బాబు, లయ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులలో ఒక రకమైన క్లాసిక్ ఫీల్ కలుగుతుంది. ఇప్పుడీ కాంబోలో వస్తున్న ‘వదలా’ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ జూలై 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రీ ఎంట్రీలో జగపతి బాబు, లయ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


