...
...
Next Story

ఒక్కటి కాదు.. రోజూ ఇలాంటివి మరో 79 ఘటనలు జరుగుతాయి.. మనం దానికి అలవాటు పడిపోవడమే అసలు బాధ: నటి తాప్సీ కామెంట్స్

నటి తాప్సీ పన్ను తన నెక్ట్స్ మూవీ అస్సీ (Assi)తోపాటు బీహార్ లో ఓ నీట్ విద్యార్థి చనిపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇలాంటివి దేశంలో రోజూ మరో 79 జరుగుతాయని, వీటికి మనం అలవాటుపడిపోవడమే అసలు విషాదం అని ఆమె చెప్పింది.

Published on: Feb 17, 2026, 16:10:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

పాట్నాలో జరిగిన నీట్ (NEET) విద్యార్థిని మృతి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను స్పందించింది. ఇలాంటి దారుణాలు మనకు సాధారణమైపోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన నెక్ట్స్ మూవీ 'అస్సి' (Assi) విడుదల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ కేసు పూర్వాపరాలు ఇక్కడ చూడండి.

అసలేం జరిగింది?

ఒక్కరు కాదు.. రోజూ ఇలాంటి మరో 79 మంది కూడా చనిపోతున్నారు.. మనం దానికి అలవాటు పడిపోవడమే అసలు బాధ: నటి తాప్సీ కామెంట్స్ (Aftab Alam)
ఒక్కరు కాదు.. రోజూ ఇలాంటి మరో 79 మంది కూడా చనిపోతున్నారు.. మనం దానికి అలవాటు పడిపోవడమే అసలు బాధ: నటి తాప్సీ కామెంట్స్ (Aftab Alam)

బీహార్‌లోని పాట్నాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మౌనం వీడింది. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "ఆ ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఇలాంటివి మరో 79 కేసులు నమోదై ఉంటాయి. నాకు చాలా బాధగా ఉంది. మన దేశంలో సగటున రోజుకు 80కి పైగా ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు, మనం ఇలాంటి కేసులకు ప్రాముఖ్యత ఇవ్వడం మానేశాం.. వీటికి అలవాటు పడిపోయాం" అని తాప్సీ బాధపడింది.

గత నెలలో పాట్నాలోని ఎయిమ్స్ సమీపంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ నాలుగో అంతస్తు నుంచి పడిపోయిన ఒక విద్యార్థిని చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆమెపై లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతురాలి లోదుస్తులపై కొన్ని ఆనవాళ్లు లభించడంతో, నిందితుల డీఎన్‌ఏతో సరిపోల్చే పనిలో అధికారులు ఉన్నారు.

సీబీఐ చేతికి కేసు..

ఈ కేసులో స్థానిక పోలీసుల విచారణ సరిగా లేదని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. దీంతో బీహార్ ప్రభుత్వం కేసును సీబీఐ (CBI)కి అప్పగించింది. విచారణలో అలసత్వం వహించినందుకు ఇద్దరు పోలీసు అధికారులను పాట్నా పోలీసులు సస్పెండ్ చేశారు.

'అస్సి' సినిమా.. రోజుకు 80 కేసులు!

మనోజ్ పహ్వా, నసీరుద్దీన్ షా వంటి దిగ్గజ నటులు ఉన్న ఈ కోర్ట్‌రూమ్ డ్రామా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది. సమాజంలో జరుగుతున్న దారుణాలకు ఈ సినిమా అద్దం పట్టనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks