Chahal As Venu Madhav: క్రికెట్, సినిమా.. జనాలకు బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అందించే రెండు డిఫరెంట్ మార్గాలు ఇవి. అలాంటిది ఇవి రెండు కలిస్తే వచ్చే కిక్కే వేరు. సినిమా సెలబ్రిటీలు క్రికెట్ ఆడుతుండటం, క్రికెటర్లు మూవీ డైలాగ్స్, సాంగ్స్ కు రీల్స్ చేయడం ఇలాంటిదే. తాజాగా యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్ ఇలాగే చేశారు.
వేణు మాధవ్ లా చాహల్

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ మ్యాచ్ లో సీరియస్ గా ఉన్నా బయట మాత్రం చాలా ఫన్నీగా ఉంటారు. ముఖ్యంగా చాహల్ బోలెడు కామెడీ చేస్తాడు. ఇక గబ్బర్ శిఖర్ కూడా డ్యాన్స్ తో అదరగొడతాడు. తాజాగా వీళ్లిద్దరూ ఒక్క చోట కలిశారు. వెంటనే వేణు మాధవ్ లా చాహల్, బ్రహ్మానందంలా శిఖర్ ధావన్ మారిపోయారు.
అప్పలరాజు మూవీ
సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సెటైరికల్ మూవీ ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు’. 2011లో వచ్చిన ఈ సినిమాలో సునీల్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, వేణు మాధవ్ కామెడీ రోల్స్ లో నటించారు. ఇందులో రౌడీ షీటర్ అయిన బ్రహ్మానందం మూవీకి ఫైనాన్స్ చేయడానికి ముందుకు వస్తాడు.
కానీ సినిమాలో తాను రాసిన పాటలనే పెట్టాలంటాడు. ఇక బ్రహ్మానందానికి సెక్యూరిటీ గార్డుగా వేణు మాధవ్ నటించారు.
మీమ్ డైలాగ్
ఈ సినిమాలో బ్రహ్మానందం ఏం చెప్పినా వెనుకాలే ఉంటే వేణు మాధవ్ ‘వా అన్నా వా’ అంటూ పొగిడేస్తుంటాడు. ఈ డైలాగ్ పాపులర్ మీమ్ మెటీరియల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ డైలాగ్ నే శిఖర్ ధావన్, వేణు మాధవ్ ఇమిటేట్ చేశారు. ఇందులో శిఖర్ ధావన్ బ్రహ్మానందంలా కనిపించగా.. వెనుకాలే ఉండే వేణు మాధవ్ లా చాహల్ ‘వా అన్నా వా’ అంటూ మిమిక్ చేశాడు.
ఇది నిజమేనా?
{{/usCountry}}ఈ సినిమాలో బ్రహ్మానందం ఏం చెప్పినా వెనుకాలే ఉంటే వేణు మాధవ్ ‘వా అన్నా వా’ అంటూ పొగిడేస్తుంటాడు. ఈ డైలాగ్ పాపులర్ మీమ్ మెటీరియల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ డైలాగ్ నే శిఖర్ ధావన్, వేణు మాధవ్ ఇమిటేట్ చేశారు. ఇందులో శిఖర్ ధావన్ బ్రహ్మానందంలా కనిపించగా.. వెనుకాలే ఉండే వేణు మాధవ్ లా చాహల్ ‘వా అన్నా వా’ అంటూ మిమిక్ చేశాడు.
ఇది నిజమేనా?
{{/usCountry}}సోషల్ మీడియాలో శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ వీడియో వైరల్ గా మారింది. తెలుగులో టాప్ కమెడియన్లయినా బ్రహ్మానందం, వేణు మాధవ్ లా వీళ్లు నటించడంతో తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.
దివంగత నటుడు వేణు మాధవ్ లా చాహల్ చేయడంతో ఇది నిజమేనా అంటూ సోషల్ మీడియాలో వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. వేణు మాధవ్ టైమింగ్ ను కొట్టే కమెడియనే లేడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.