OTT Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ప్రేక్షకులను అలరించడానికి మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తోంది. అదే 'తీన్ తిగాడ' (Teen Tigada). కుర్రకారును ఆకట్టుకునే రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
కథ ఏంటంటే..

'తీన్ తిగాడ' అనేది యువత కలలు, వారి జీవితాల్లో అనుకోకుండా జరిగే పరిణామాల చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ప్రధానంగా అస్మాని, మానస్ అనే లవర్స్ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఒకరు మ్యూజిక్ రంగంలో, మరొకరు క్రికెట్‌లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటుంటారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
ఆ ఒక్క తప్పుతో
అస్మాని ఏమో చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని కల కంటుంది. కానీ ఒక్క రాత్రి అస్మాని, మానస్ ఫిజికల్ గా దగ్గరవుతారు. దీంతో అస్మానికి ప్రగ్నెన్సీ వస్తుంది. మరోవైపు తండ్రి కావడానికి మానస్ కూడా రెడీగా ఉండడు. కెరీర్ కోసం కలలు కంటున్న సమయంలోనే పేరెంట్‌హుడ్ బాధ్యతలు ఎదురైతే వారు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు? ప్రేమ, కుటుంబం, కెరీర్.. ఈ మూడింటి మధ్య వారి ప్రయాణం ఎలా సాగిందనేదే ఈ వెబ్ సిరీస్ మొయిన్ స్టోరీ.
ట్రైలర్ ఎలా ఉందంటే?
తాజాగా విడుదలైన 'తీన్ తిగాడ' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ సీన్స్‌తో పాటు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను ట్రైలర్‌లో అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. కలలు కనే వయసులో ఊహించని బాధ్యతలు మీద పడితే వచ్చే సంఘర్షణను ట్రైలర్‌లో చాలా సహజంగా చూపించారు.
ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ యూత్‌ను కట్టిపడేసేలా ఉన్నాయి. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, అందులో ఉన్న పెయిన్, స్ట్రగుల్ స్పష్టంగా కనిపిస్తోంది.
నటీనటులు వీళ్లే
{{/usCountry}}ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ యూత్‌ను కట్టిపడేసేలా ఉన్నాయి. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, అందులో ఉన్న పెయిన్, స్ట్రగుల్ స్పష్టంగా కనిపిస్తోంది.
నటీనటులు వీళ్లే
{{/usCountry}}ఈ వెబ్ సిరీస్‌లో ప్రసన్న బిష్ట్, దనేష్ రజ్వీ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. వీరితో పాటు తాన్యా భరద్వాజ్, ఈషా నారాయణ్ సింగ్, దివ్యాంశు బిష్ట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు రాజీవ్ రాజ్ చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కించారు.
ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ 'తీన్ తిగాడ' వెబ్ సిరీస్ నవంబర్ 20 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీ భాషలో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది. యూత్‌ఫుల్ కంటెంట్, బోల్డ్ రొమాంటిక్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది.