...
...
Next Story

Amaram Teaser: హీరోగా తేజేష్ రాజన్ ఎంట్రీ- 200 మందితో యాక్షన్, 60 మంది డ్యాన్సర్లతో ఫోక్ సాంగ్- అమరం టీజర్ రిలీజ్!

Tejesh Rajan Amaram Teaser Released: తమిళ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న తేజేష్ రాజన్ నటించిన డెబ్యూట్ మూవీ అమరం. ఐరా అగర్వాల్ హీరోయిన్‌గా చేసింది. తిరువరుల్ కృష్ణన్ దర్శకత్వం వహించిన అమరం తెలుగు వెర్షన్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్‌తో అమరం టీజర్ ఆకట్టుకుంది.

Published on: May 7, 2026, 09:37:16 IST
Advertisement

Tejesh Rajan Amaram Teaser Released: కోలీవుడ్‌లోకి మరో హీరో అడుగుపెడుతున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలోకి తేజేష్ రాజన్ హీరోగా అడుగుపెడుతున్నాడు. తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం అమరం. ఈ సినిమాకు తిరువరుల్ కృష్ణన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అమరం చిత్రం తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్‌తో అరమం టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

ట్రైబల్ స్మగ్లర్, యువతి

హీరోగా తేజేష్ రాజన్ ఎంట్రీ- 200 మందితో యాక్షన్, 60 మంది డ్యాన్సర్లతో ఫోక్ సాంగ్- అమరం టీజర్ రిలీజ్!
హీరోగా తేజేష్ రాజన్ ఎంట్రీ- 200 మందితో యాక్షన్, 60 మంది డ్యాన్సర్లతో ఫోక్ సాంగ్- అమరం టీజర్ రిలీజ్!

ఓ ట్రైబల్ స్మగ్లర్‌, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను కూడా బలంగా ప్రతిబింబిస్తుంది. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను కూడా బలంగా ప్రజెంట్ చేస్తోంది.

200 మందితో యాక్షన్

వెస్ట్రన్ ఘాట్స్‌లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ప్రత్యేక యాక్షన్ బ్లాక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బాంబేకు చెందిన మార్షల్ ఆర్ట్స్ టీమ్ సహకారంతో మాస్టర్ మిరాకిల్ మైఖేల్ ఆధ్వర్యంలో మూడు భారీ యాక్షన్ బ్లాక్స్ తెరకెక్కించారు. లోతైన ప్రేమకథను సిట్యువేషనల్ యాక్షన్‌తో మేళవించి చిత్రాన్ని రూపొందించారు.

సింగిల్ టేక్‌లో పూర్తి

తేజేష్ రాజన్ తొలి సినిమాకే అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్‌లో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొడైకెనాల్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం డాల్ఫిన్ నోస్ వద్ద తెరకెక్కించిన ఒక కీలక సన్నివేశాన్ని ఆయన సింగిల్ టేక్‌లో పూర్తి చేయడం విశేషం.

అమరం నటీనటులు

ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఈ అమరం సినిమాకు సంగీతం అందించగా, ‘వడచెన్నై’, ‘అసురన్’ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన రామర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. కొత్త సినిమాటోగ్రాఫర్ భరత్ విజువల్స్ అందించారు. అడవిలో, యాక్షన్ సీక్వెన్స్‌లో తెరకెక్కించిన విజువల్స్ బాగున్నాయి.

ప్రభుదేవా సన్నిహిత సహాయకుడు

అమరన్ చిత్రంలో ఐదు పాటలు ఉండగా, వాటికి ప్రముఖ కొరియోగ్రాఫర్ భూపతి మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఆయన రాజు సుందరం, ప్రభుదేవా మాస్టర్లకు సన్నిహిత సహాయకుడిగా మంచి గుర్తింపు పొందారు.

60 మంది డ్యాన్సర్లతో ఫోక్ సాంగ్

కొడైకెనాల్‌లో ఆర్ట్ డైరెక్టర్ జనా సర్ రూపొందించిన భారీ సెట్‌లో ఓ ప్రత్యేక ఫోక్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటలో కేరళకు చెందిన 60 మంది డ్యాన్సర్లు పాల్గొనడం విశేషం. మిక్కీ జే మేయర్ అందించిన ఈ ఫోక్ నెంబర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వేర్వేరు సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఓ జంట అనుకోని పరిస్థితుల్లో చేసే ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలతో సినిమా ఉత్కంఠభరితంగా సాగనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe