సినిమా టికెట్ ధరల అంశం సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి, అక్కడే చెప్పుకోండి : హైకోర్టు

సినిమా టికెట్ ధరల వ్యవహారం సింగిల్ బెంచ్ జడ్జి వద్దే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అప్పీలును స్వీకరించడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని తెలిపింది.

Published on: Jan 28, 2026, 08:41:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు సంబంధించిన వివాదాలను సింగిల్ జడ్జి దగ్గరే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్‌పీ దాఖలు చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ చిత్రాల టిక్కెట్ల ధరల పెంపుదలకు అనుమతిస్తూ ప్రభుత్వ మెమోను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మునుపటి ఆదేశాలను అప్పీల్‌ను సవాలు చేసింది. టిక్కెట్ ధరల పెంపుపై భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాన్ని కనీసం 90 రోజుల ముందుగానే ప్రకటించాలని సింగిల్ జడ్జి.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అప్పీల్ చేసింది.

అక్కడే చెప్పుకోండి

తాజాగా ఇరువైపులా వాదనలు విన్న డివిజన్ బెంచ్.., సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలకు సంబంధించిన పిటిషన్లు ప్రస్తుతం సింగిల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే ఆ విషయాలను విచారించే సింగిల్ జడ్జి ముందు చెప్పుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు బెంచ్ నిరాకరించింది. ఈ సమస్యను సింగిల్ జడ్జి స్థాయిలో పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించింది.

రిట్ పిటిషన్‌లోనే

అప్పీలుదారుడు లేవనెత్తిన అంశాలను మధ్యంతర ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడం ద్వారా కాకుండా సింగిల్ జడ్జి బెంచ్ ముందు కొనసాగుతున్న రిట్ పిటిషన్‌లో పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

సినిమాపై ప్రభావం పడలేదు

'అప్పీలుదారుని విషయానికొస్తే తాత్కాలిక ఉత్తర్వు సినిమా విడుదలను ప్రభావితం చేయనట్లు కనిపిస్తోంది. తాత్కాలిక ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఈ అప్పీలును స్వీకరించడానికి మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు.' అని కోర్టు పేర్కొంది. రిట్ పిటిషన్‌లో ఉన్న అంశాలపై అప్పీలుదారు, ఇతర పార్టీలకు స్వేచ్ఛను మంజూరు చేసింది.

చిరంజీవి సినిమాతో

చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ధరల పెంపునకు అనుమతిస్తూ జనవరి 8న జారీ చేసిన మెమో ఆధారంగా ఈ కేసు వచ్చింది. సినిమా టిక్కెట్ల ధరలో అకస్మాత్తుగా పెరుగుదల వల్ల ప్రజలు సమీక్షలు లేదా ప్రాతినిధ్యాలను దాఖలు చేసే హక్కు లేకుండా పోతుందని పిటిషనర్, న్యాయవాది దాచేపల్లి చంద్రబాబు ఈ మెమోను సవాలు చేశారు. చట్టం ప్రకారం సమీక్షలు లేదా ప్రాతినిధ్యాలను దాఖలు చేసే హక్కును నిరోధిస్తున్నారని ఆయన వాదించారు.

ఆ తర్వాత సినిమా విడుదల తేదీకి 90 రోజుల ముందు టికెట్ ధరలను పెంచడంపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేక్షకులతో సహా వాటాదారులు ఈ నిర్ణయంపై సమీక్ష కోసం దాఖలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత షైన్ స్క్రీన్స్ ఇండియా ఈ మధ్యంతర ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసింది. తాజాగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులో జోక్యం చేసుకోకుండా అప్పీలును కొట్టివేసింది. ఏదైనా ఉంటే సింగిల్ బెంచ్ దగ్గరే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More